వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ టెన్షన్‌లోనూ కాంగ్రెస్‌పై కన్నేసిన అమిత్ షా.. మరో వికెట్ ఔట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కశ్మీర్‌లో భద్రతా దళాలు మొహరించాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే .. మరికొందరు తప్పుపడుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి పరిస్థితి మారితే .. బీజేపీ చీఫ్ అమిత్ షా మాత్రం వలసలపై ఫోకస్ చేసినట్టున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి ముఖ్య నేతలంతా కమలం గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ రాజ్యసభ విప్‌పై దృష్టిసారించారు అమిత్ షా. తాము తీసుకున్నది దేశ సంక్షేమం కోసమేనని పేర్కొన్నారు.

బై.. బై..

బై.. బై..

కశ్మీర్‌కు కల్పించిన స్వయం ప్రతిపత్తిని ఎత్తివేస్తున్నామని కేంద్రం ప్రకటించడంతో అగ్గిరాజేసింది. దీనిపై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన చేయగానే విపక్ష కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. ఇదీ అప్రజాస్వామికమని రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర పక్షాలు, ఎంపీలంతా కలిసి రాజ్యసభ పోడియం చుట్టుముట్టి నినానాలు చేశారు. పరిస్థితి ఇంత పీక్‌గా ఉంటే కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ విప్, ఎంపీ భువనేశ్వర్ కలిటా తమ పార్టీ విధానాన్ని తప్పుపట్టారు. కశ్మీర్‌పై మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. విపక్ష విప్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. తమ పార్టీ విప్ పార్టీ విధానాన్ని తప్పుపట్టడం ఏంటని మిగతా నేతలంతా విస్మయానికి గురయ్యారు.

తప్పేముంది ..

జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం సరైనదేనన్నారు భువనేశ్వర్. ఆర్టికల్ 370ను విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్య సదృశ్యమేనన్నారు. ఈ మేరకు భువనేశ్వర్ పేరుతో రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియా వైరలవుతుంది. 370పై విప్ జారీచేయాలని కాంగ్రెస్ పార్టీ భువనేశ్వర్‌కు ఆదేశించింది. కానీ అతను మాత్రం అందుకు సుతారాం ఒప్పుకోలేదు. తమ పార్టీ విప్ జాతి ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అందుకోసమే పార్టీలో ఉండొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు తమ పార్టీ భ్రష్టు పట్టడానికి ప్రధాన కారణం హైకమాండ్ మీదనా అని అనుమానం వ్యక్తంచేశారు. తమ పార్టీ మునిగిపోతున్న నావ అని ఆ లేఖలో ఉంది. అసోంకి చెందిన భువనేశ్వర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ పార్టీ విధానాలను వ్యతిరేకించి పార్టీకి రాజీనామా చేశారు.

వలసలపై ఫోకస్

వలసలపై ఫోకస్

దేశవ్యాప్తంగా కశ్మీర్‌పై తీవ్ర చర్చ జరుగుతుంటే .. బీజేపీ అగ్రనేతలు మాత్రం తమ పార్టీలోకి వలసలపై ఫోకస్ చేశారు. రాజ్యసభలో పూర్తి మెజార్టీ లేని బీజేపీ తమ సభ్యులను పెంచుకునేందుకు క్రమంగా ప్రయత్నిస్తూనే ఉంది. ఇటీవలే యూపీకి చెందిన సంజయ్ సింగ్ బీజేపీలో చేరగా .. భువనేశ్వర్ రాజీనామాతో ఆ సంఖ్య రెండుకి చేరింది. దాదాపు 15 మంది సభ్యుల మద్దతు బీజేపీకి అవసరం ఉంటే .. ఆ ఫిగర్ కోసం బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నది. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు స్పష్టమవుతుంది.

English summary
congress whip in Rajya Sabha, Bhubaneswar Kalita, has resigned over his party's stand on the government's move to revoke Article 370 and bifurcate Jammu and Kashmir into two Union Territories. The MP claimed that the Congress party was committing suicide by oppsoing the aborgation of Article 370. In a letter circulating online, Bhubaneswar Kalita said that the party leadership had asked him to issue a whip but he felt that the "whip was against the nation's sentiments". Thus, he said, he decided to resign from the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X