వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ఎన్నికలు, సీ-ఫోర్ సర్వే: కాంగ్రెస్ దే అధికారం, బీజేపీకి సినిమా, మోడీ, అమిత్ షా!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Karnataka Assembly Elections 2018 : C Fore Survey Predicts

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తోందని సీ-ఫోర్ సర్వే తేల్చి చెప్పింది. 2013 లో జరిగిన శాసన సభ ఎన్నికల కంటే అధికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకుంటుందని సోమవారం సీ-ఫోర్ సర్వే విడుదల చెయ్యడంతో బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. సర్వే విడుదలైన తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మోడీ, అమిత్ షాల పాచికపారదని సర్వే అంటోంది.

25 రోజుల్లో 154 నియోజక వర్గాలు

25 రోజుల్లో 154 నియోజక వర్గాలు

2018 మార్చి 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సీ-ఫోర్ సర్వే నిర్వహించింది. 154 శాసన సభ నియోజక వర్గాల్లో 22,357 మంది ఓటర్లను కలిశారు. 2,368 పోలింగ్ కేంద్రాల్లో సర్వే నిర్వహించి సర్వేని విడుదల చేశామని సోమవారం సీ-ఫోర్ సర్వే తెలిపింది.

326 నగరాలు, పట్టణాలు

326 నగరాలు, పట్టణాలు

326 నగరాలు, పట్టణాలు, 977 గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించామని, ఒక్క శాతం సర్వే అంచనాలు తప్పు అయ్యే అవకాశం ఉంటుందని సీ-ఫోర్ సర్వే వివరించింది. అయితే 2018లో జరిగే శాసన సభ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని సీ-ఫోర్ సర్వే తేల్చి చెప్పింది.

 కాంగ్రెస్ కు 46 శాతం

కాంగ్రెస్ కు 46 శాతం

2013లో సీ-ఫోర్ సర్వే విడుదల చేసింది. ఆ సందర్బంలో కాంగ్రెస్ పార్టీకి 119 నుంచి 120 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. 2013లో జరిగిన ఎన్నికల్లో 36.6 శాతం ఓట్లు సంపాధించుకున్న కాంగ్రెస్ పార్టీ 122 సీట్లు సొంతం చేసుకుంది.

బీజేపీ ఆశలపై నీళ్లు

బీజేపీ ఆశలపై నీళ్లు

2018లో జరిగే శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన బలం పెంచుకుని 46 శాతం ఓట్లు సంపాధించుకుంటుందని, బీజేపీ 31 శాతం ఓట్లు, జేడీఎస్ 16 శాతం ఓట్లు సంపాధించుకుంటుందని సీ-ఫోర్ సర్వే తెలిపింది.

కాంగ్రెస్ పార్టీ కింగ్

కాంగ్రెస్ పార్టీ కింగ్

2013లో 122 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 2018 శాసన సభ ఎన్నికల్లో 126 స్థానాల్లో విజయం సాధిస్తుందని సీ-ఫోర్ సర్వే చెప్పింది. బీజేపీ తన స్థానాలను పెంచుకుంటుందని, జేడీఎస్ మాత్రం 2013లో విజయం సాధించిన స్థానాలకంటే తక్కువ సీట్లకు పరిమితం అవుతోందని సర్వే వివరించింది.

సర్వే లెక్కలు ఇవి

సర్వే లెక్కలు ఇవి

2013లో బీజేపీ 40 స్థానాల్లో విజయం సాధించింది. అయితే 2018లో బీజేపీ 70 స్థానాలు కైవసం చేసుకుంటుందని సీ-ఫోర్ సర్వే చెప్పింది. 2018 శాసన సభ ఎన్నికల్లో జేడీఎస్ 27 నుంచి 40 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని, ఇతరులు 7 శాతం ఓట్లు సంపాధించుకుని ఒక అసెంబ్లీ స్థానంలో గెలిచే అవకాశం ఉందని సీ-ఫోర్ సర్వే చెప్పింది.

మహిళా ఓటర్లు

మహిళా ఓటర్లు

సీ-ఫోర్ సర్వే ప్రకారం 48 శాతం మహిళలు, 44 శాతం పురుషులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని, 29 శాతం మంది మహిళలు, 33 శాతం మంది పురుషులు బీజేపీకి ఓటు వేస్తామని, 17 శాతం మంది పురుషులు, 14 శాతం మంది మహిళలు జేడీఎస్ కు ఓటు వేస్తామని, 8 శాతం మంది మహిళలు, 6 శాతం మంది పురుషులు ఇతరులకు ఓటు వేస్తామని సర్వేలో చెప్పారని సీ- ఫోర్ సర్వే వివరించింది.

వయసు తేడా లేదు !

వయసు తేడా లేదు !

కర్ణాటకలో అన్ని వయసుల వారిని సీ-ఫోర్ సర్వే సంప్రధించింది. అందులో 18 నుంచి 25 ఏళ్ల లోపు వారు 46 శాతం, 26 నుంచి35 ఏళ్లలోపు వారు 47 శాతం, 36 నుంచి 50 ఏళ్లలోపు వారు 43 శాతం, 50 ఏళ్ల పైన ఉన్న ఓటర్లు 50 శాతం మంది తాము కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తామని, ఆ పార్టీ అధికారంలో ఉంటే మాకు మంచి జరుగుతోందని చెప్పారని సీ-ఫోర్ సర్వే వివరించింది.

అమిత్ షాకు షాక్

అమిత్ షాకు షాక్

అమిత్ షా కర్ణాటక పర్యటనలో ఉన్న సమయంలోనే సీ-ఫోర్ సర్వే విడుదల కావడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు. సోమవారం సీ-ఫోర్ సర్వే విడుదలైన తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటుంటే బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం మౌనంగా ఉన్నారు. సీ-ఫోర్ సర్వేని ఇప్పటి వరకూ బీజేపీ నాయకులు విమర్శించలేదు.

English summary
Karnataka Assembly Elections 2018: The Congress will return to power in Karnataka in 2018. Congress will win 126 seats in 224-member Legislative Assembly, predicts 'C-Fore' in its latest survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X