వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొరికిన నయా లీడర్: కన్నయ్య వస్తానంటే కాంగ్రెస్ ఓకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరతానంటే త‌మ‌కు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే కన్న‌య్యకు వేరే రాజకీయ అనుబంధాలు ఉన్నాయన్నారు.

ఒకవేళ ఆయన తమ పార్టీలోకి వస్తానంటే ఎందుకు వద్దంటామని చెప్పారు. జాతీయ‌తావాదంపై శశిథరూర్ మాట్లాడుతూ.. జాతీయతను ఒక రాజకీయ అంశంగా మార్చిందెవరని ప్రశ్నించారు. ఇది బిజెపి రాజకీయ వ్యూహమేన్నారు.

బిజెపి త‌మ‌ విమర్శకులను, వ్యతిరేకులను దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంద‌ని, అధికార పార్టీయే ప్రభుత్వం కాదనీ, అలాగే ప్రభుత్వమే దేశం కాదన్నారు. కన్నయ్య ఈ కాలపు భగత్ సింగ్ అని థరూర్ ఇటీవల వ్యాఖ్యానించారు. భగత్‌సింగ్ వామపక్ష భావజాలంతో విదేశీ ప్రభుత్వంపై పోరాడారని, కన్నయ్య ప్రధాని మోడీ ప్రభుత్వానికి, దేశంలోని పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నారు. దీనిపై దుమారం రేగింది.

నయా లీడర్ కన్నయ్య

నయా లీడర్ కన్నయ్య

జెఎన్‌యు నేత కన్నయ్య కుమార్ వామపక్ష పార్టీ అనుబంధ సంస్థ నాయకుడు. ఇతనిని వామపక్షాలు ముందుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

నయా లీడర్ కన్నయ్య

నయా లీడర్ కన్నయ్య

లెఫ్ట్ పార్టీ నేతలు అతనికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన ద్వారా వామపక్షాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని ఉవ్వీళ్లూరుతున్నారని అనే వాదనలు వినిపిస్తున్నాయి.

నయా లీడర్ కన్నయ్య

నయా లీడర్ కన్నయ్య


కన్నయ్య కుమార్ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈయనకు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మద్దతు పలుకుతుండటం గమనార్హం.

నయా లీడర్ కన్నయ్య

నయా లీడర్ కన్నయ్య

కన్నయ్య కుమార్‌కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ నేతలు, అతను తమ పార్టీలో చేరినా అభ్యంతరం లేదని చెప్పడం గమనార్హం. వామపక్షాలకు కన్నయ్య కుమార్ రూపంలో నయా రాజకీయ నాయకుడు దొరికాడని అంటున్నారు.

English summary
Congress won't have any problem if JNUSU president Kanhaiya Kumar decides to join party: Shashi Tharoor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X