వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్త సూసైడ్ అటెంప్ట్.. ఎందుకో తెలుసా..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అన్నివర్గాల నుంచి వినతులు వెల్లువెత్తిన నేపథ్యంలో 4 నెలల వరకు పార్టీ పగ్గాలు చేపడుతానని రాహుల్ స్పష్టంచేశారు. సోనియా, ప్రియాంక సహా ముఖ్యనేతలు చెప్పినా .. రాహుల్ వినిపించుకోవడం లేదు.

సూసైడ్ అటెంప్ట్ ..
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. అయితే వారి డిమాండ్‌ను రాహుల్ పట్టించుకోవడం లేదు. దీంతో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. రాహుల్ రాజీనామాను వ్యతిరేకిస్తూ సూసైడ్ అటెంప్ట్ చేశారు. కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొనేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడున్న శ్రేణులు అడ్డుకున్నారు. రాహుల్ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్యకర్త డిమాండ్ చేశారు.

Congress worker attempts suicide to stop Rahul Gandhi from resigning

శ్రేణుల ఆందోళన ...
ఇదివరకు కాంగ్రెస్ శ్రేణులు కూడా నిరవధిక సమ్మెకు దిగాయి. రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయి. శుక్రవారం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. వీరిలో ఏఐసీసీ కార్యదర్శులు మహేందర్ జోషి, నసీబ్ సింగ్, ఢిల్లీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్ లిలోథియా, శోభా ఓజా, జగదీశ్ టైట్లర్ కూడా ఉన్నారు. రాహుల్ తన రాజీనామా వెనక్కి తీసుకోవాలని నిరవధిక సమ్మెకు దిగామని రాజేశ్ లిలోతియా పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలకు బాధ్యత .. ఆయా నేతలు వహిస్తారు తప్ప .. అధ్యక్షుడు కాదని స్పష్టంచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని నడిపించేంది గాంధీ-నెహ్రూ కుటుంబాలేనని మరో నేత శోభా పేర్కొన్నారు.

English summary
The Congress is as adamant on making party chief Rahul Gandhi stay at his post as he is on quitting. On Tuesday, a Congress worker allegedly attempted suicide in Delhi in a bid to stop Rahul Gandhi from resigning. The Congress worker, who remains unidentified, tried to hang himself from a tree outside the party office in Delhi. "Rahul Gandhi should take back his resignation else I will hang myself," he told media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X