వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown:మే 4వ తేదీ నుంచి కొన్ని జిల్లాల్లో సడలింపు, కానీ ఆంక్షలు, నిబంధనలు మాత్రం తప్పనిసరి

|
Google Oneindia TeluguNews

వైరస్ ప్రభావం లేని జిల్లాల్లో లాక్‌డౌన్ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మే 4 నుంచి ఆ జిల్లాల్లో సడలింపులు ఇస్తామని పేర్కొన్నది. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ మార్గదర్శకాలు పాటించాలని.. ఆ మరునాటి నుంచి ఏ నిబంధనలను అనుసరించాలనే అంశాన్ని తెలియజేస్తామని హోంశాఖ అదికార ప్రతినిధి ఒకరు సోషల్ మీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Recommended Video

:Lockdown :Considerable Relaxation From Lockdown For Many Districts From May 4
మే 4 తర్వాత..

మే 4 తర్వాత..

దేశంలో లాక్‌డౌన్‌పై హోంశాఖ రాష్ట్రాలతో రివ్యూ నిర్వహించిందని పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల అద్భుత ఫలితాలు వచ్చాయని.. దీనిని కొనసాగిస్తామన్నారు. మే 3వ తేదీ వరకు ఆంక్షలు కఠినంగా ఉంటాయని.. తర్వాత పరిస్థితిని బట్టి చర్యలు తీసుకుంటామని వివరించారు. సోమవారం ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించిన సమీక్షలో రెడ్ జోన్, హాట్ స్పాట్, కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే లాక్ డౌన్ కొనసాగుతోందని.. వైరస్ ప్రభావం లేని జిల్లాలకు సడలింపులు ఇస్తామని సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

40 రోజులు..

40 రోజులు..

వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మార్చి 24వ తేదీ నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకు అంటే 40 రోజులు లాక్ డౌన్ కంటిన్యూ అయ్యింది. దీంతో వైరస్ తగ్గుముఖం పట్టిన ప్రాంతాలకు గత రెండువారాల నుంచి మినహాయింపులు ఇస్తూ వస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నారు. హాట్ స్పాట్ కానీ, కంటైన్మెంట్ జోన్ కానీ ప్రాంతాల్లో నాన్ ఎస్సెన్సియల్ గూడ్స్ విక్రయించేందుకు హోంశాఖ అనుమతించిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వలసకూలీలు సొంత రాష్ట్రం వెళ్లేందుకు బుధవారం హోంశాఖ పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల వలసకూలీలు, విద్యార్థులు ఎక్కడికక్కడ చిక్కుకున్న సంగతి తెలిసిందే.

250 జిల్లాలు

250 జిల్లాలు

దేశంలో 250 జిల్లాలు గ్రీన్ జోన్ పరిధిలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ పాక్షికంగా ఎత్తివేస్తారు. ఆంక్షలను మాత్రం కొద్దిగా సడలిస్తారు. ఇన్ ఫెక్షన్ ప్రభావం ఉన్నందున పరిస్థితిని నిశీతంగా గమనిస్తారు. దేశంలో 31 వేల 787 పాజిటివ్ కేసులు ఉండగా...మృతుల సంఖ్య 1008కి చేరింది. గత 24 గంటల్లోనే 71 మంది చనిపోయారు. గత పదిహేను రోజుల్లో రెడ్ జోన్ల సంఖ్య 170 నుంచి 129కి పడిపోయింది. ఇదే సమయంలో గ్రీన్ జోన్ల సంఖ్య కూడా 325 నుంచి 307కి పడిపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆరెంజ్ జోన్ల సంఖ్య మాత్రం 207 నుంచి 297కి పెరిగింది.

English summary
union home ministry on Wednesday said fresh guidelines to combat the coronavirus outbreak in the country that will give considerable relaxations to many districts from May 4 will be released soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X