ఎవరెస్టు ఎక్కాం :తప్పుడు సమాచారం ఇచ్చిన పోలీసు దంపతులు సస్పెన్షన్

ఫూణే : తప్పులు చేసిన వారిని పట్టుకొనే ఉద్యోగంలో ఉన్నారు. కాని, వారే తప్పు చేశారు. తాము చేసిన తప్పును ఎవరూ గుర్తించలేరని భావించారు. ఎట్టకేలకు ఆ తప్పులు గుర్తించిన ఉన్నతాధికారులు వారిని ఉద్యోగాల నుండి తప్పించారు.

ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించామంటూ కానిస్టేబుల్ దంపతులు మార్పింగ్ ఫోటోలు సృష్టించి పలువురి మన్ననలను పొందారు. అయితే ఈ ఫోటోలు ఈ ప్రచారమే వారి కొంపముంచింది.వారి తప్పును బయటపెట్టింది.ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకొంది.

మహారాష్ట్రలోని పూణెలో తారకేశ్వరీ, ధినేష్ రాథోడ్ దంపతులు పోలీస్ కానిస్టేబుళ్ళుగా పనిచేస్తున్నారు.ఈ ఏడాది మే 23 వ, తేదిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్టుగా ప్రకటించారు. ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన తొలి దంపతులుగా ప్రకటించుకొన్నారు.

 constable couple suspension for giving wrong information

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్టుగా మార్ఫింగ్ చేసిన ఫోటోలను, నేపాల్ ప్రభుత్వ పర్యాటకశాఖ ఇచ్చిన సర్టిఫికెట్ ను చూపారు. ఈ ఆధారాలతో పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుల్ దంపతులను సన్మానించారు.అయితే వారు విధుల్లో చేరకపోవడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపితే అసలు విషయం వెలుగు చూసింది.

ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన పర్వతారోహకులను పిలిపించి విచారణ చేశారు.దీంతో అసలు విషయం బయటపెట్టింది.పొంతన లేని సమాధానాలు చెప్పారు ఆ కానిస్టేబుల్ దంపతులు.దీంతో అసలు విషయాన్ని బయటపెట్టారు కానిస్టేబుల్ దంపతులు. తారకేశ్వరీ, దినేష్ రాథోడ్ లనుసస్పెండ్ చేస్తున్నట్టు పూణె పోలీసు కమీషనర్ రష్మీ శుక్లా ప్రకటించారు.కానిస్టేబుల్ దంపతులు చూపిన ఫోటోలు మార్పింగ్ వని సైబర్ నిపుణులు తేల్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+