• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కంప్లైట్ చేసేందుకు వెళ్తే మాటలతో వేధించిన పోలీస్.. వీడియో షేర్ చేసి కడిగిపారేసిన ప్రియాంక (వీడియో)

|
  కంప్లైట్ చేసేందుకు వెళ్తే మాటలతో వేధించిన పోలీస్..!! వీడియో

  కాన్పూర్ : ఫ్రెండ్లీ పోలిసింగ్, మీ రక్షణ కోసమే మేమున్నామంటూ ఎన్ని ప్రకటనలు ఇస్తున్నా పోలీసులంటే ఇప్పటికీ జనాల్లో భయమే. అన్యాయం, అక్రమాలు, వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్లాలంటే పౌరులు వెనకడుగు వేస్తారు. కొందరు పోలీసులు ప్రవర్తించే విధానమే అందుకు కారణం. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. లైంగిక వేధింపుల గురించి కంప్లైంట్ చేసేందుకు వెళ్లిన బాలికను పోలీస్ కానిస్టేబుల్ తన మాటలతో వేధించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.

  ప్రెసిడెంట్ పదవి చేపట్టలేనన్న ప్రియాంక.... రేసులో ఆ ఏడుగురు..

  అభ్యంతరకరంగా మాట్లాడిన కానిస్టేబుల్

  కాన్పూర్‌కు చెందిన 16ఏళ్ల బాలికను కొందరు యువకులు వేధించారు. అడ్డుకునేందుకు వెళ్లిన ఆమె కుటుంబసభ్యులపై దాడి చేశారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. న్యాయం కోసం కొండంత ఆశతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వారికి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తార్ బాబు చుక్కలు చూపించాడు. బాధితురాలని నానా మాటలన్నాడు. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించిన తార్ బాబు అమ్మాయి ప్రవర్తన గురించి అవమానకరంగా మాట్లాడాడు. అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశాడు.

  వ్యక్తిత్వం కించపరిచేలా వ్యాఖ్యలు

  వ్యక్తిత్వం కించపరిచేలా వ్యాఖ్యలు

  ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలిని ఓదార్చాల్సింది పోయి చేతి వెళ్లకు ఉంగరం ఎందుకు పెట్టుకున్నావు? మెడలో గొలుసు ఎందుకు వేసుకున్నావు. అన్ని నగలు వేసుకోవడం అవసరమా వాటి వల్ల ఏమిటీ ఉపయోగం అని ఇబ్బందికరమైన ప్రశ్నలు వేశాడు. అంతటితో ఆగకుండ నీ వేషం చూస్తేనే నీవేంటో అర్థమవుతోందని ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడాడు. ఆమె తల్లిదండ్రులు మాట్లాడే ప్రయత్నం చేయగా వారితోనూ దురుసుగా ప్రవర్తించాడు. నానా మాటలు అన్నాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని అమ్మాయి సోదరుడు వీడియో తీశాడు. సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. బాధితురాలో అభ్యంతరకర రీతిలో మాట్లాడిన హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.

   ట్విట్టర్‌లో షేర్ చేసిన ప్రియాంక గాంధీ

  ట్విట్టర్‌లో షేర్ చేసిన ప్రియాంక గాంధీ

  సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో మహిళల భద్రత కోసం పోలీసులు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో అర్థమవుతుందని అన్నారు. వీళ్లేనా మహిళల్ని రక్షించేది అన్ని ప్రశ్నించారు. వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపించి తప్పు చేసినట్లు తేలితే హెడ్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  English summary
  A 16-year-old girl who tried to file a complaint of molestation in Uttar Pradesh's Kanpur, is subjected to harassment in a video tweeted by Congress leader Priyanka Gandhi Vadra. The head constable seen interrogating the teen has been removed.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X