వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయ్ దివస్ ఎఫెక్ట్ : సీనియర్ కానిస్టేబుల్‌‌కు ఏఎస్సైగా ప్రమోట్.. ఎక్కడో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

అమృత్‌సర్ : విజయ్ దివాస్ .. పక్కలో బళ్లెంలా తయారైన పాకిస్థాన్‌ మూకలను భారత భూభాగం నుంచి సైన్యం తరిమికొట్టింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదేరోజున పాకిస్థాన్ సైన్యాన్ని తరిమికొట్టడంతో ఏటా విజయ్ దివాస్ జరుపుకుంటున్నాం. అయితే ఆనాడు యుద్ధంలో పాల్గొన్న సైనికులకు భారత ప్రభుత్వం అవార్డులతో సన్మానించింది. అలాగే పంజాబ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌కు ఏఎస్సైగా ప్రమోట్ చేశారు. కానిస్టేబుల్ సేవలను గుర్తించి ప్రమోషన్ ఇచ్చింది పంజాబ్ ప్రభుత్వం.

కశ్మీర్ యుద్ధంలో సప్తాల్ సింగ్ అనే కానిస్టేబుల్ పాల్గొన్నారు. యుద్ధంలో ఎదురొడ్డి పోరాడారు. శత్రుదేశ సైన్యాన్ని ముకరిల్లేలా చేశారు. తన సహచరులతో కలిసి శత్రుదేశాన్ని గజగజలాడించాడు. యుద్ధంలో వీరోచితంగా పోరాడిన సప్తాల్ సింగ్‌ను భారత ప్రభుత్వం గురించింది. ఆయనకు వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది. అయితే కానిస్టేబుల్ నుంచి సీనియర్ కానిస్టేబుల్‌గా కొనసాగుతున్నారు. కానీ విధి నిర్వహణలో మాత్రం ప్రమోషన్ రాలేదు. అయినా అధైర్యపడకుండా ముందుకుసాగారు. కానీ ఇన్నాళ్లకు .. దాదాపు 20 ఏళ్ల తర్వాత అతనికి ఎట్టకేలకు ప్రమోషన్ లభించింది.

constable promote as asi in punjab

సప్తాల్ సింగ్ సేవలను పంజాబ్ ప్రభుత్వం గుర్తించింది. వీర్ చక్ర అవార్డు గ్రహీత అయిన ఆయనకు ప్రమోషన్ ఇవ్వాలని భావించింది. ఈ మేరకు సీనియర్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్సైగా ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపింది. దీంతో సప్తాల్ సింగ్ ఆనందానికి అవధి లేకుండా పోయింది. ఇన్నాళ్లకు తనకు ప్రమోషన్ లభించిందని ఆనందపడుతున్నారు. తనను ప్రమోట్ చేసిన పంజాబ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ప్రస్తుతం పంజాబ్‌లోని సంగ్రూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు.

English summary
META DESCRIPTIONPunjab CM Captain Amarinder Singh promotes Vir Chakra awardee Satpal Singh to the post of Assistant Sub-Inspector from Senior Constable, in recognition of his action during Kargil War. He is currently posted in district Sangrur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X