వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసింది ఒక బ్రాహ్మణుడు: గుజరాత్ స్పీకర్

|
Google Oneindia TeluguNews

గుజరాత్: భారత రాజ్యాంగం అంటే అందరికీ గుర్తుకు వచ్చే పేరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. రాజ్యాంగంపై ఎక్కడ చర్చ వచ్చిన అక్కడ వినిపించేది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు. అయితే రాజ్యాంగం ముసాయిదా తయారు చేసింది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాదని దీని వెనక బీఎన్ రావు కృషి ఉందని.. రావు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారని గుజరాత్ స్పీకర్ రాజేంద్ర త్రివేది అన్నారు. గుజరాత్‌లో జరిగిన బ్రాహ్మిణ్ బిజినెస్ సమ్మిట్‌లో స్పీకర్ రాజేంద్ర త్రివేది ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగ ముసాయిదా తయారు చేసింది బీఎన్ రావు..?

రాజ్యాంగ ముసాయిదా తయారు చేసింది బీఎన్ రావు..?

భారత రాజ్యాంగ ముసాయిదా తయారీలో బ్రాహ్మణుడైన బెనెగల్ నర్సింగ్ రావు కృషి ఉందని ఈ మాటలను స్వయంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పారని గుర్తుచేశారు రాజేంద్ర త్రివేది. అంతేకాదు ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డు 9 మంది భారతీయులను వరిస్తే అందులో 8 మంది బ్రాహ్మణ సామాజిక వర్గంవారే ఉన్నారని వెల్లడించారు. తాజాగా ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న అభిజీత్ బెనర్జీ కూడా బ్రాహ్హణుడే అని చెప్పుకొచ్చారు స్పీకర్ రాజేంద్ర త్రివేది.

ఈ రోజు బీఆర్ అంబేడ్కర్‌కు ఆ క్రెడిట్ దక్కుతోంది

ఈ రోజు బీఆర్ అంబేడ్కర్‌కు ఆ క్రెడిట్ దక్కుతోంది


60 దేశాలా రాజ్యాంగాలను క్షుణ్ణంగా చదివిన తర్వాతే భారత రాజ్యాంగ ముసాయిదాను తయారు చేశారని అన్నారు స్పీకర్ రాజేంద్ర త్రివేది. ఆ రాజ్యాంగం ముసాయిదాను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు ఎవరు ఇచ్చారో తెలుసా.. అని ప్రశ్నించిన స్పీకర్ త్రివేది అది బ్రాహ్మణుడైన బీఎన్ రావు అందజేశారని చెప్పారు. ఈ రోజు రాజ్యాంగం అంటే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కొనియాడుతున్నామని చెప్పిన స్పీకర్.. వాస్తవానికి ఆ కృషి మొత్తం ఒక బ్రాహ్మణుడు చేశారన్న సంగతి చాలామందికి తెలియదని వెల్లడించారు.

బీఎన్ రావుకే క్రెడిట్ దక్కుతుందని అంబేడ్కర్ అన్నారు

బీఎన్ రావుకే క్రెడిట్ దక్కుతుందని అంబేడ్కర్ అన్నారు

రాజ్యాంగ ముసాయిదాపై క్రెడిట్ తనది కాదని ప్రశంసలు అంతా బీఎన్ రావుకే దక్కుతాయని నాడు స్వయంగా బీఆర్ అంబేడ్కరే చెప్పారన్న విషయాన్ని స్పీకర్ త్రివేది గుర్తుచేశారు. బ్రాహ్మణుల కష్టం ఎప్పుడూ తెరవెనకే ఉంటుందని వారు వెనకుండి ఇతరులను ప్రమోట్ చేస్తారని కొనియాడారు స్పీకర్. ఇది చరిత్ర చెబుతుందని ఇందుకు నిదర్శనం రాజ్యాంగ ముసాయిదాను తాను తయారు చేసి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను బీఎన్ రావు ప్రమోట్ చేశారని చెప్పారు. 1949 నవంబర్ 25న జరిగిన సమావేశంలో రాజ్యాంగ ముసాయిద తయారు చేసిన ఘనత బీఎన్ రావుకు దక్కుతుందని అంబేడ్కర్ చెప్పడాన్ని బ్రాహ్మణులైన తాము ఎంతో గర్వపడుతామని చెప్పారు త్రివేది.

ఈ మధ్య ఢిల్లీలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో రాజేశ్ శుక్లా అనే ఫైర్ సిబ్బంది 11 మంది ప్రాణాలను కాపాడారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన స్పీకర్ రాజేంద్ర త్రివేది... శుక్లా కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అంటూ సభలో చెప్పారు. స్పీకర్ రాజేంద్ర త్రివేది సమావేశంలో ప్రసంగిస్తుండగా సీఎం విజయ్ రూపానీ వేదికపైనే ఉన్నారు.

English summary
Gujarat Assembly Speaker Rajendra Trivedi on Friday claimed that Dr B R Ambedkar had given credit for preparation of the draft of the Constitution to B N Rau, who was a Brahmin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X