వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జరిమానా: షారుక్ చెప్పాడని వాడితే అందం పెరగలేదు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఫెయిర్‌నెస్ క్రీమ్ ఇమామీకి చెందిన ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్ బ్రాండ్‌పై ఓ వినియోగదారుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఇమామీకి రూ. 15 లక్షల జరిమానా విధించిన కోర్టు, ఆ వ్యాపార ప్రకటనను వెంటనే తొలగించాలని ఇమామీని ఆదేశించింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తన అభిమాన నటుడు షారుక్ ఖాన్ నటించిన వ్యాపార ప్రకటన చూసి, తాను ఇమామీ ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్ క్రీమును వాడానని, అయితే ఆ ప్రకటనలో చెప్పినట్టుగా ఎటువంటి ఫలితాలు రాలేదని ఆరోపిస్తూ ఢిల్లీకి చెందిన నిఖిల్ జైన్ (23) కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

Consumer Court Pulls Up Emami’s Fair and Handsome, Slaps a Fine of Rs 15 lakh

దీనిని నాలుగు వారాలు వాడితే ముఖమంతా ప్రకాశ వంతంగా వికసిస్తుందని ఆ ప్రకటనలో హామీ ఇచ్చారని అందులో పేర్కొన్నాడు. కాగా షారుక్‌పై ఉన్న నమ్మకంతో 2012 అక్టోబర్ 8వ తేదీన దీనిని కొనుగోలు చేశానని, నెల రోజుల వాడినా తన ముఖంలో ఎలాంటి మార్పు రాలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు.

అమితీ లా స్కూల్‌లో న్యాయవిద్యను అభ్యసిస్తున్న తన అన్నయ్య పరాస్ జైన్‌తో కలసి నిఖిల్ జైన్ వినియోగదారుల కోర్టులో పిటిషన్ వేశాడు. దాదాపు మూడు సంవత్సరాలు పాటిన ఈ విచారణలో ఇమామీ వాదనను కోర్టు తోసిపుచ్చుతూ రూ. 15 లక్షల జరిమానా విధించింది.

అంతేకాదు చర్మం పట్ల ప్రజల్లో అభద్రతా భావాన్ని కలగజేస్తున్న ఆ వ్యాపార ప్రకటనను వెంటనే తొలగించాలని ఆదేశించింది. అందం పేరిట ఉపయోగపడని ఉత్పత్తులను కొని ఇతరులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ పిటిషన్ వేసినట్లు నిఖిల్ జైన్ పేర్కొన్నాడు.

English summary
A district consumer court has pulled up Emami' Fair and Handsome, a fairness cream brand. The court has slapped a fine of Rs 15 lakh on the brand and has even ordered it to withdraw advertisements promising dramatic transformation in skin complexion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X