వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాముడికి-అల్లాకు మధ్య ఎన్నికల్లో పోటీ, హిందూ ఓట్లు వద్దా: మంత్రి కామెంట్స్‌పై బీజేపీ ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

Recommended Video

రాముడికి-అల్లాకు మధ్య ఎన్నికల్లో పోటీ

బెంగళూరు: కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంట్వాల్ నియోజకవర్గంలో ఎన్నికలు శ్రీరాముడికి, అల్లాకు మధ్య జరుగుతున్న పోరు అని బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కౌంటర్‌గా ఈయన చేశారు.

సునీల్ కుమార్ కర్కాల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బంట్వాల్ దక్షిణ కర్నాటకలో సెన్సిటివ్ నియోజకవర్గం. త్వరలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

బీజేపీకి ఝలక్: 2019లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయంబీజేపీకి ఝలక్: 2019లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం

ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే, అంతకుముందు బంట్వాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి రామనాథ రాయ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను అల్లా వల్ల గెలిచానని, ముస్లీం కమ్యూనిటీ వల్ల గెలిచానని అభిప్రాయపడ్డారు. తాను ఆరుసార్లు బంట్వాల్ నుంచి గెలవడానికి వారే కారణం అన్నారు.

మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్, అల్లా-రాముడికి మధ్య పోరు

మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్, అల్లా-రాముడికి మధ్య పోరు

ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్‌గా సునీల్ కుమార్ మాట్లాడారు. అయితే, వచ్చే ఎన్నికలు అల్లాకు, రాముడికి మధ్య పోరుగా అభివర్ణించారు. మంత్రి ఇలా మాట్లాడినందున వచ్చే ఎన్నికలు హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించినవి అని అభిప్రాయపడ్డారు. మంత్రి చేసిన వ్యాఖ్యలతో తాను షాకయ్యానని చెప్పారు.

ఆరుసార్లు గెలిచి ఇలా అంటారా

ఆరుసార్లు గెలిచి ఇలా అంటారా


ఈ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు అందరి మద్దతుతో గెలిచి, మంత్రిగా ఉండి తాను అల్లా వల్ల గెలిచానని చెప్పడం విడ్డూరమన్నారు. మంత్రి అలా వ్యాఖ్యానించినందున తాను ఓ మాట చెబుతున్నానని సునీల్ కుమార్ అన్నారు.

ఇదే నా విన్నపం

ఇదే నా విన్నపం

ఇక్కడి స్నేహితులకు తాను ఓ విజ్ఞప్తి చేస్తున్నానని, బంట్వాల్‌లో ఎన్నికలు బీజేపీ నేత రాజేష్ నాయక్, రామనాథ రాయ్ మధ్య కాదని, మంత్రి వ్యాఖ్యలను బట్టి అల్లా, రాముడి మధ్య అని చెప్పారు. బంట్వాల్ ప్రజలకు ఎవరు కావాలో నిర్ణయించుకోవాలన్నారు. ఎవరు గెలుస్తారో చూద్దామన్నారు.

హిందూ ఓట్లు అవసరం లేదన్నట్లుగా మాట్లాడితే

హిందూ ఓట్లు అవసరం లేదన్నట్లుగా మాట్లాడితే

బీజేపీ నేత సునీల్ కుమార్ ఇంకా మాట్లాడుతూ.. ఆరుసార్లు ఓ నియోజకవర్గం నుంచి గెలిచిన ఓ నాయకుడు తనకు హిందూ ఓట్లు అవసరం లేదన్నట్లుగా మాట్లాడితే కచ్చితంగా తమ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమే అన్నారు. ఇది కేవలం భంట్వాల్ నియోజకవర్గానికే కాదని, జిల్లా మొత్తానికి సంబంధించిన అంశమన్నారు.

English summary
A BJP legislator in Karnataka has said the contest in the state's Bantwal constituency during the upcoming assembly polls will be "between Allah and Lord Rama", responding to comments from a minister who credited his successive wins in the polls to Allah and Muslims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X