• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Controversial: ఫాతిమా మాస్టర్ ప్లాన్, పక్కాస్కెచ్ తో లొంగిపోయింది, దేవుడితో గేమ్స్? ఏంటి సంగతి!

|

కొచ్చి/ న్యూఢిల్లీ: ఎదుగుతున్న కొడుకు, కూతురితో అర్దనగ్నంగా శరీరం మీద వాటర్ పెయింటింగ్ వేయించుకుని ఆ వీడియోను 'బాడీ ఆర్ట్స్ అండడ్ పాలిటిక్స్' పేరుతో సోషల్ మీడియాలో పోస్టు చేసి తీవ్రవివాదానికి కారణమైన కేరళ వివాదాస్పద ఆక్టివిస్టు రెహానా ఫాతిమా ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయింది.

హై కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు రెహానా ఫాతిమాకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో దిక్కుతొచక మాస్టర్ ప్లాన్ వేసిన రెహానా ఫాతిమా పక్కా స్కెచ్ తో కేరళ పోలీసుల ముందు లొంగిపోయింది. నేను దేవుడితో పోరాటం చేస్తానంటూ ఎగరేసుకుని ఎగిరెగిరి పాటుపడింది ఈ రెహానా ఫాతిమా. రెహానా ఫాతిమాను అదుపులోకి తీసుకున్న కొచ్చి పోలీసులు ఆమెను మెజిస్ట్రేట్ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.

Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ!

నేను దేశాన్ని ఉద్దరిస్తా.... చూస్తారా?

నేను దేశాన్ని ఉద్దరిస్తా.... చూస్తారా?

తాను అనుకుంటే ఏమైనా చేస్తానని, నేను తలుచుకుంటే ఏ పని అయినా చిటెకెలో చేస్తానని బిల్డప్ ఇచ్చిన కేరళకు చెందిన రెహానా ఫాతిమా రెచ్చిపోయింది. మహిళ హక్కుల కోసం పోరాటం చేస్తాననని, ఎక్కడ అన్యాయం జరిగినా సహించనని భారీ సినిమా డైలాగులు చెప్పి నానా హంగామా చేసిన రెహానా ఫాతిమా ఆక్టివిస్టు అవతారం ఎత్తి ఒక్కసారిగా సంచలనానికి కేంద్ర బింధువు అయ్యింది.

శబరిమల అయ్యప్పతో పెట్టుకుంది

శబరిమల అయ్యప్పతో పెట్టుకుంది

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలని రెహానా ఫాతిమా అనేక మంది మహిళలతో కలిసి పెద్ద ఎత్తున రాద్దాంతం చేసింది. హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా రెహానా ఫాతిమా బహిరంగంగా విమర్శలు చేసింది. ఆ సమయంలో చాలా మంది ముస్లీం పెద్దలు సైతం రెహానా ఫాతిమా తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో రెహానా ఫాతిమా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోవడంతో ఆమె మరింత రెచ్చిపోయింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన రెహానా ఫాతిమా తీరుపై తీవ్ర విమర్శలు ఎదురుకావడంతో ఆమె ఉద్యోగానికే ఎసరు వచ్చింది.

బిడ్డలతో కలిసి పాడుపని

బిడ్డలతో కలిసి పాడుపని

అసలే ఉద్యోగం ఊడిపోవడంతో కష్టాలు మొదలైన రెహానా ఫాతిమా కొన్ని నెలల క్రితం అర్దనగ్నంగా శరీరంపై వాటర్ పెయింటింగ్ వేయించుకుని ఫ్రీగా పబ్లిసిటీ సంపాధించాలని ప్రయత్నించింది. 14 ఏళ్లు, 8 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు బిడ్డలతో ( మైనర్లు) అర్దనగ్నంగా తయారై వాటర్ పెయింట్ వేయించుకోవడమే కాకుండా ఆ వీడియోలో సోషల్ మీడియాలో పోస్టు చేసి సమాజానికి తప్పుడు సంకేతాలు పంపించడానికి ప్రయత్నంచిందని కేరళ ప్రభుత్వం వివాదాస్పద ఆక్టివిస్టు రెహానా ఫాతిమా మీద పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

హైకోర్టు, సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ

హైకోర్టు, సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ

పోక్సో చట్టం కింద కేసులు నమోదు అయినా రెహానా ఫాతిమా కొంచెంకూడా దగ్గలేదు. తాను చెయ్యరాని పని ఏమీ చెయ్యలేదని, తన శరీరం మీద పెయింటింగ్ వేసింది తన కొడుకు అంటూ సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. పోలీసులు అరెస్టు చెయ్యకుండా రెహానా ఫాతిమా కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యడానికి కేరళ హైకోర్టు నిరాకరించడంతో రెహానా ఫాతిమా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు సైతం రెండు రోజుల క్రితం రెహానా ఫాతిమాకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించి మీరు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ? అని చివాట్లు పెట్టి ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టి వేసింది.

  Kozhikode : మరణించిన 18 మంది ప్రయాణికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్! || Oneindia Telugu
  ఫాతిమా లాజిక్?

  ఫాతిమా లాజిక్?

  పోలీసులు స్వయంగా వచ్చి అరెస్టు చేస్తే బెయిల్ రావడం మరింత కష్టం అవుతోందని భావించిన రెహానా ఫాతిమా ఆమె న్యాయవాదులను వెంటపెట్టుకుని నేరుగా కొచ్చి పోలీసు అధికారుల ముందుకు వెళ్లి లొంగిపోయింది. కొచ్చి పోలీసులు రెహానా ఫాతిమాను అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. తాను స్వయంగా లొంగిపోతే త్వరగా బెయిల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని రెహానా ఫాతిమా పక్కా ప్లాన్ వేసిందని, ఆమె మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో బెయిల్ అంత త్వరగా రాదని కేరళలోని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

  English summary
  Kerala: Controversial activist Rehana Fathima surrendered before the police here on Saturday, a day after the Supreme Court dismissed her anticipatory bail plea in cases against her for circulating a video in which she was semi-nude, allowing her minor children to paint on her body.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X