పూరీ ఆలయ సమీపంలో సర్వేపై వివాదం.. ఏం జరిగిందంటే..
ప్రముఖ పుణ్యక్షేత్రం, పూరిలో గల జగన్నాథ్ ఆలయం సమీపంలో గల భూ సర్వేపై వివాదం చెలరేగింది. సర్వేకు సంబంధించి కాంట్రవర్సీకి రాజకీయ దుమారం రేపుతుంది. పూరిలో గల జగన్నాథ ఆలయం చుట్టూ రూ.800 కోట్లతో శ్రీ మందిర్ పరిక్రమ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. అయితే నెలరోజుల తర్వాత పురావస్తు సంపద గుర్తించేందుకు జీపీఆర్ఎస్ సర్వేను శనివారం రాత్రి ప్రారంభించింది. ఏదైనా నిర్మాణం ప్రారంభించే ముందు జీపీఆర్ఎస్ చేసి ఉండాలి. ఒడిశా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్.. గాంధీనగర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పనిచేసింది.

జగన్నాథ ఆలయం చుట్టూ ఉన్న వివాదాస్పద నిర్మాణంపై ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలయ్యింది. ఈ మేరకు ఒడిశా హైకోర్టుకు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. 15 నుంచి 20 అడుగుల స్ట్రాటిఫైడ్ డిపాజిట్ తొలగింపు జరిగిందని తెలుస్తోంది. వారసత్వ ప్రదేశానికి నష్టం కలిగించింది. ఇటు ఎమ్మార్ మఠం కూల్చివేసిన ప్రదేశం నుంచి సగం విరిగిన సింహం శిల్పాలు కనుగొన్నారు. పురాతన అవశేషాలు అని ముందే ఊహించి ఏఎస్ఐ వాటి ముక్కలను తన ఆధీనంలోకి తీసుకున్నారు.