వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో మారు బండ బాదుడు ...గ్యాస్ ధరల పెంపు

|
Google Oneindia TeluguNews

మరోమారు వంట గ్యాస్ ధరలు మంట పుట్టించనున్నాయి. డీజిల్‌, పెట్రోలు ధరలు పెంచుతూ ఇప్పటికే సామాన్యుడిపై పెనుభారం మోపుతున్న కంపెనీలు పేదవాడి నడ్డి విరుస్తూ సబ్సిడీ గ్యాస్‌ ధరను మరోసారి పెంచాయి. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగటంతో ధరాఘాతం సామాన్యులకు శరాఘాతంగా మారింది .

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు, విదేశీ మారకం విలువలో ఒడిదొడుకుల నేపథ్యంలో ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. ఒక్కో సబ్సి డీ సిలిండర్‌పై రూ.2.08, సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.42.5 పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) గురువారం తెలిపింది. వరుసగా గత మూడునెలలు వంట గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి.కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా తిరిగి ధరల పెంపు జరుగుతోంది.ప్రస్తుతం ఏటా 12 వంట గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నది.

Cooking gas price up by Rs 2.08, non-subsidised rate hiked by Rs 42.50 per cylinder

ప్రస్తుతం పెరిగిన చమురు ధరలపై పన్ను ప్రభావంతో గ్యాస్ సిలిండర్ ధరల పెంపు తప్పని సరైందని ఐవోసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.493.53 ఉండగా, మార్చి ఒకటో తేదీ నుంచి పెరిగిన ధరలతో రూ.495.61 కానుంది. ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర రూ.701.50కు పెరగనుంది .
English summary
Domestic cooking gas (LPG) price was Thursday hiked by Rs 2.08 per cylinder and non-subsidised gas by Rs 42.50 per bottle, Indian Oil Corporation (IOC) said.The increase comes after three straight monthly reduction in rates.The rise has been necessitated due to tax impact on increased market rate of the fuel, IOC said in a statement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X