వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శృంగారానికి 'ఓకె' అంటేనే కేసు ముందుకు కదులుతుంది: రేప్ బాధితురాలికి ఎస్ఐ వేధింపులు

నిందితులు స్వేచ్చగా బయట తిరుగుతుండటంతో.. తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె స్థానిక ఎస్ఐ జై ప్రకాశ్ సింగ్ కి ఫిర్యాదు చేసింది.

|
Google Oneindia TeluguNews

రాంపూర్: సహాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కే ఒంటరి మహిళలంటే పోలీసులకూ చులకనే. కేసు మీద పెట్టాల్సిన దృష్టిని బాధితురాళ్ల మీదకు మళ్లించి.. తిరిగి వారినే వేధించే ఘటనలు గతంలో చాలానే వెలుగుచూశాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.

నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితురాలు ఎస్ఐని ఆర్థించగా.. కోరిక తీరిస్తేనే కేసు ముందుకు కదులుతుందంటూ తన నీచబుద్దిని బయటపెట్టుకున్నాడు. పోలీసులు కూడా తననే వేధిస్తుండటంతో.. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో కాలం వెళ్లదీస్తున్న ఆమెకు ఓ ఆలోచన తట్టింది. ఎస్ఐ అసభ్య సంభాషణలను తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో సదరు ఎస్ఐ బాగోతం బయటపడింది.

బాధితురాలికే వేధింపులు:

బాధితురాలికే వేధింపులు:

ఓ అత్యాచార బాధితురాలు న్యాయం కోసం ఇటీవల రాంపూర్ లోని గంజ్ పోలీస్ అధికారులను సంప్రదించింది. నిందితులు స్వేచ్చగా బయట తిరుగుతుండటంతో.. తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె స్థానిక ఎస్ఐ జై ప్రకాశ్ సింగ్ కి ఫిర్యాదు చేసింది. నిందితులను అరెస్టు చేయాల్సిందిగా వేడుకుంది. సదరు ఎస్ఐ మాత్రం నిందితుల గురించి ఆరా తీయాల్సింది పోయి.. బాధితురాలి పట్ల దారుణంగా వ్యవహరించాడు.

శృంగారానికి ఒప్పుకుంటేనే

శృంగారానికి ఒప్పుకుంటేనే

తొలుత తనతో శృంగారానికి ఒప్పుకుంటేనే ఈ కేసులో తదుపరి చర్యలు ఉంటాయని తన వక్రబుద్దిని బయటపెట్టుకున్నాడు. దీనికి బాధితురాలు ససేమిరా అనడంతో.. కేసును క్లోజ్ చేస్తున్నట్లు రిపోర్ట్ కూడా రెడీ చేసి మరో షాక్ ఇచ్చారు. ఏం చేయాలో తెలియని స్థితిలో.. మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితురాలు.. ఈసారి ఎస్ఐ అసభ్య సంభాషణలను రికార్డు చేయగలిగింది.

ఆపై ఎస్ఐ తనతో మాట్లాడిన సంభాషణలను బుధవారం నాడు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఎస్ఐ వ్యవహారంపై విచారణ జరిపించాల్సిందిగా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఏఎస్పీ సుధా సింగ్ మీడియాకు తెలిపారు.

ఫిబ్రవరిలో అత్యాచారం

ఫిబ్రవరిలో అత్యాచారం

ఇదిలా ఉంటే, రాంపూర్ ఎస్ఐని ఆశ్రయించిన బాధితురాలు.. ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఇద్దరు వ్యక్తుల చేతిలో అత్యాచారానికి గురైంది. అందులో ఒకతను బాధితురాలికి తెలిసిన వ్యక్తే కావడం గమనార్హం. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరిచయం ఉన్న వ్యక్తే కావడంతో.. లిఫ్ట్ ఇస్తానని చెప్పడంతో వారి వాహనంలోనే ఆమె ఇంటికి చేరుకుంది.

తెలిసిన వ్యక్తే!

తెలిసిన వ్యక్తే!

అయితే ఇంటి దగ్గర దిగబెట్టిన తర్వాత.. వారిద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తొలుత దీనిపై కేసు నమోదు చేయడానికి కూడా నిరాకరించిన పోలీసులు.. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ఆదేశాలతో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కూడా ఆమెను ఎస్ఐ వేధించడం.. ఎస్పీని ఆశ్రయించడంతో దీనిపై విచారణకు ఆదేశించడం జరిగాయి. కానీ రాంపూర్ సూపరిండెంట్ పోలీస్ మాత్రం.. ఆడియో టేపుల్లో ఉన్నది ఎస్ఐ గొంతు కాదని తెలిపారు. అయినప్పటికీ ఎస్పీ ఆదేశాల మేరకు దీనిపై విచాణ జరుగుతుందన్నారు.

English summary
A 37-year-old woman, who had been raped by two men early this year, had gone to the investigating officer (IO) at Rampur's Ganj police station for help. She said her rapists are roaming around freely and she fears for her life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X