వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: కానిస్టేబుల్ సాహసం: నడుంలోతు వరద ప్రవాహంలో..ఇద్దరు చిన్నారులను భుజాన మోస్తూ!

|
Google Oneindia TeluguNews

భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం అవుతోంది. వరదపోటుతో అల్లాడుతోంది. గుజరాత్ లో పలు జిల్లాలు వరద బారిన పడ్డాయి. తపతీ సహా దాదాపు అన్ని నదులూ ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మోర్బి జిల్లాలోని మారుమూ గ్రామంలో సహాయక చర్యల్లో పాల్గొన్న పృధ్వీరాజ్ జడేజా అనే కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఇద్దరు చిన్నారులను కాపాడటం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాణి సోషల్ మీడియాలో షేర్ చేశారు. హైదరాబాదీ లెజెండ్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సహా పలువురు ప్రముఖులు ఆ కానిస్టేబుల్ సాహసాన్ని ప్రశంసిస్తున్నారు.

గుజరాత్ లో కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల మోర్బీ జిల్లా వరద తాకిడికి గురైంది. జిల్లాలోని కల్యాణ్ పర్ గ్రామం దాదాపు నీట మునిగిపోయింది. ఈ పరిస్థితుల్లో తమ కన్నవారు ఎక్కడున్నారో తెలియక ఇద్దరు చిన్నారులు ప్రాణభయంతో సహాయం కోసం ఎదురు చూస్తోన్న దృశ్యం కానిస్టేబుల్ పృథ్వీరాజ్ జడేజా కంట్లో పడింది. ఏ మాత్రం ఆలస్యం చేయలేదాయన. ఈ చిన్నారులను ఆదుకోవడానికి రంగంలోకి దిగాడు. ఎలాంటి రక్షణ సామాగ్రి అందుబాటులో లేనప్పటికీ.. వెనకడుగు వేయలేదు.

Cop Carries 2 Children For 1.5 Km In Waist-Deep Floodwater In Gujarat

వరద ప్రవాహంలోనే వారు ఉన్న ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్లాడు. వారిని తన భుజాలపై కూర్చోబెట్టుకుని సుమారు ఒకటిన్నర కిలోమీటర్ దూరం వరద ప్రవాహంలోనే నడుచుకుంటూ సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ఒకవైపు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద భయపెడుతున్నప్పటికీ..అదర లేదు, బెదరలేదు. ఆ చిన్నారులను భుజాన మోస్తూ, నడుం లోతు నీళ్లల్లో ఒకటిన్నర కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వచ్చారు. పృధ్వీరాజ్ జడేజా చేసిన ఈ సాహసం ముఖ్యమంత్రి విజయ్ రూపాణి గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం ఈ ఉదంతంపై స్పందించారు. ఆ కానిస్టేబుల్ కు సెల్యూట్ చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో సరికొత్త చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి.. చిన్నారుల కోసం పృథ్వీరాజ్ జడేజా చేసిన సహాయం ఆయనలోని ధైర్యసాహసాలకు ప్రతిరూపంగా నిలిచిందని అన్నారు. హైదరాబాదీ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ సుప్రియా సాహు ఆయనను ప్రశంసించారు.

English summary
Amid visuals of devastation across the country due to incessant rains, a video of a police official carrying two children on his shoulder while navigating through floodwaters has emerged from Gujarat. In a widely-shared video, a Gujarat police constable is seen carrying two children on his shoulders for over 1.5 km as he walks through waist-deep water in a village in Morbi district, about 200 km from capital Ahmedabad. Despite the strong current, constable Pruthvirajsinh Jadeja looks calm as he takes them to safety.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X