వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సలాం పోలీస్: వడోదరలో వరదలు..ఈ చిన్నారిని ఆ పోలీస్ ఎలా కాపాడాడో చూడండి..!

|
Google Oneindia TeluguNews

వడోదర: గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వడోదర నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఇక వరదల ధాటికి నివాస ప్రాంతాల్లోకి మొసళ్లు వస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాదు కొన్ని మనసును హత్తుకునే దృశ్యాలను నెటిజెన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది.

వడోదరను ముంచెత్తిన వరదలు

వడోదరను ముంచెత్తిన వరదలు

వడోదరను వరదలు ముంచెత్తాయి. అక్కడి ప్రజల పరిస్థితి చాలా దుర్భరంగా మారింది. సరిగ్గా ఈ సమయంలోనే ఒకరి కొకరు సహాయం చేసుకుంటూ అండగా ఉండటం చూస్తే ఎవరికైనా సరే మనసు కదిలిపోతుంది. కష్టాల్లో ఉన్నవారిని మరొకరు ఆదుకోవడం చూస్తే కళ్లలో కన్నీళ్లు ఆగవు. ఈ కష్ట సమయంలో వారంతా ఒక్కటిగా నిలవడం నిజంగా వారి ఐక్యతను చాటుతోంది. గత కొద్దిరోజులుగా వడోదరలో కురుస్తున్న భారీవర్షాలకు ఇలాంటి దృశ్యాలు చాలా దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో కన్నీటి గాథలు కనిపిస్తున్నాయి.

పసికందును సురక్షితంగా కాపాడిన పోలీస్

తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజెన్లు కదిలిపోతున్నారు. ఈ వీడియోను షంషేర్ సింగ్ అనే ఐపీఎస్ అధికారి పోస్టు చేశారు. గోవింద్ చావ్‌డా అనే కానిస్టేబుల్ ఓ 45 రోజుల పసికందును టబ్‌లో పెట్టుకుని వరదనీటిలో సురక్షితంగా తీసుకువస్తున్న వీడియోను ఐపీఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే ఇది వైరల్ అయ్యింది. గోవింద్ చావ్‌డా దాదాపు నాలుగు అడుగుల ఎత్తుకు చేరుకున్న వరదనీటిలో చిన్నారిని జాగ్రత్తగా తీసుకురావడంపై చాలా మంది నెటిజెన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు

ఇదిలా ఉంటే గత 24 గంటల్లో వడోదరలో 499 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇందులో బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటలకు అంటే కేవలం నాలుగు గంటల్లో 286 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం.ఇక వరద నీరు అజ్వా డ్యాంను తాకడంతో అధికారులు డ్యామ్ గేట్లు ఎత్తి లోతట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కొన్ని ప్రాంతాల్లో ఆరడుగుల ఎత్తుకు నీళ్లు చేరాయి. ఇక మొసళ్లు కూడా తిరుగుతున్నాయి. అయితే వరదనీటిలో ఇంత ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నీటిలో దిగి రాత్రింబవళ్లు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు.

English summary
A heartwarming video of a Gujarat cop saving a baby from floods in Vadodara has gone viral. In the video, shared by an IPS officer, shows Govind Chavda carrying a 45-day-old infant in a tub over his head while wading through at least four-feet water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X