వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ దేశ ద్రోహి శవం కూడా మాకొద్దు: పేలుళ్ల ఉగ్రవాది తండ్రి, ‘ఉగ్రవాది కోసం పోలీసుల ఫోన్’

మధ్యప్రదేశ్‌లో మంగళవారం భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్‌ రైలులో పేలుడుకు పాల్పడిన ముష్కరుల్లో ఒకరిని భద్రతా బలగాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

భోపాల్/లక్నో: మధ్యప్రదేశ్‌లో మంగళవారం భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్‌ రైలులో పేలుడుకు పాల్పడిన ముష్కరుల్లో ఒకరిని భద్రతా బలగాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదిని సజీవంగా పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

రైలు పేలుళ్ల ఐఎస్ ఉగ్రవాది హతం: భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు(పిక్చర్స్)

ఉగ్రవాది లొంగిపోడానికి ఒప్పుకోకపోవడం.. స్వయంగా ఓ పోలీసు అధికారి ఉగ్రవాది సోదరుడితో మాట్లాడించారు. అయినా ఉగ్రవాది లొంగిపోయేందుకు ముందుకు రాలేదు. తాను చావడానికైనా సిద్ధమే కానీ, లొంగిపోయేది లేదని ఆ ఉగ్రవాది స్పష్టం చేశాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతాదళాలు.

12గంటల ఆపరేషన్

12గంటల ఆపరేషన్

పూర్తి వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లో దాడి అనంతరం పోలీసులు విచారణ చేపట్టగా.. లక్నోలోని ఠాకూర్‌గంజ్‌లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. దాదాపు 12 గంటల సుదీర్ఘ ఆపరేషన్‌ తర్వాత పోలీసులు ఉగ్రవాది సైఫుల్లాను హతమార్చారు. అయితే ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు.

సోదరుడితో మాట్లాడించినా..

సోదరుడితో మాట్లాడించినా..

సైఫుల్లా సోదరుడు కాన్పూర్‌కు చెందిన ఖలీద్‌గా గుర్తించిన పోలీసులు అతడికి ఫోన్‌ చేశారు. ఖలీద్‌కు విషయం చెప్పి.. అతడితో మాట్లాడమని సైఫుల్లాకు డోర్‌ కింది నుంచి ఫోన్‌ను విసిరారు. పోలీసులకు లొంగిపోవాలని ఖలీద్‌ కోరినా.. సైఫుల్లా అందుకు ఒప్పుకోలేదు. ‘నేను బలవ్వాలనుకుంటున్నాను.. లొంగిపోను' అని సైఫుల్లా అతడి సోదరుడికి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో సైఫుల్లా బయటకు వచ్చేందుకు బాష్పవాయువు, మిరప బాంబులు పేల్చినట్లు చెప్పారు. అయినప్పటికీ అతడు లొంగిపోకపోవడంతో భద్రతా బలగాలు సైఫుల్లాను హతమార్చాయి.

ఉగ్రవాది వద్ద ఐసిస్‌ జెండాలు, రైల్వే టైం టేబుల్‌

ఉగ్రవాది వద్ద ఐసిస్‌ జెండాలు, రైల్వే టైం టేబుల్‌

భద్రతాబలగాల కాల్పుల్లో మృతిచెందిన ఉగ్రవాది సైఫుల్లా మృతదేహం వద్ద భారీ ఆయుధాలతో పాటు.. ఐసిస్‌ జెండాలు, రైల్వే టైం టేబుల్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో దాడి వెనుక ఐసిస్‌ హస్తం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఆ దేశ ద్రోహి శవం కూడా అవసరం లేదు

ఆ దేశ ద్రోహి శవం కూడా అవసరం లేదు

ఆ దేశ ద్రోహి శవం కూడా తమకు అవసరం లేదని లక్నో ఎన్‌కౌంటర్లో హతమైన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది సైపుల్లా తండ్రి సర్తాజ్ తేల్చి చెప్పారు. ఇది దేశానికి అనవసర విషయమని అన్నారు. కాగా, మరికొందరు బంధువులు మాత్రం.. సైఫుల్లా రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తుండేవాడని, మంచి ప్రవర్తన కలిగి ఉండేవాడని.. కానీ, అతడి నుంచి ఇలాంటి పనిని ఊహించలేదని చెప్పారు.

English summary
As hours were spent by the anti-terror squad in Uttar Pradesh to capture terror suspect Saifullah alive from a house on the outskirts of Lucknow, the police had him speak to his brother, who asked him to surrender. "I won't, I want martyrdom," Saifullah reportedly replied.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X