వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్దరాత్రి కారులో అసభ్యంగా: ఎస్ఐ చూసి !

|
Google Oneindia TeluguNews

ముంబై: అర్దరాత్రి కారులో అసభ్యంగా ఉన్నారని ఓ టీనేజ్ జంటను బ్లాక్ మెయిల్ చేసి రూ. లక్షలు లాక్కోవాలని ప్రయత్నించిన సబ్ ఇన్స్ పెక్టర్ సస్పెండ్ అయ్యాడు. ఆ యువకుడు తెగించి ఎస్ఐ చేసిన ఘనకార్యాన్ని ఎస్పీకి చెప్పి ఆధారాలు ఇవ్వడంతో సస్పెండ్ అయ్యాడు.

ముంబైలోని నయా నగర్ పోలీస్ స్టేషన్ లో శాంతారాం మహాలే ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల రాత్రి 2,20 గంటల సమయంలో శాంతారం మహాలే నయా నగర్ లో గస్తీ తిరగడానికి వెళ్లారు.

మీరా రోడ్డులో కారు నిలిపి ఉన్న విషయం గుర్తించి అక్కడికి వెళ్లాడు. కారులో ఓ 20 ఏళ్ల లోపు ఉన్న యువతి, యువకుడు చనువుగా మాట్లాడుకుంటూ అసభ్యంగా కనిపించారు. అంతే ఎస్ఐ రెచ్చిపోయాడు. ఈ రోజు నాకు జాక్ పాట్ తగిలిందనుకున్నాడు.

Cop drags couple sitting in car to police station in Mumbai

ధనవంతుల పిల్లలు చిక్కారని, రూ. లక్షలు లాక్కోవాలని ప్లాన్ వేశాడు. ఆ జంటను పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లాడు. ఆయువకుడిని బెల్ట్ తో చితకబాదేశాడు. యువతిని నీవు కాల్ గర్ల్, బార్ గర్ల్ అంటూ బూతులు తిట్టాడు.

రూ. 10 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తానని, లేదంటే ఇద్దరిమీద బ్రోతల్ కేసు పెడుతానని బెదిరించాడు. రూ. 25 వేలు ఇవ్వడానికి ఆ యువకుడు అంగీకరించాడు. రూ. 15 వేలు ఇచ్చి మిగిలిన రూ. 10 వేలు తరువాత ఇస్తానని చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నారు.

తరువాత ఎస్ఐ శాంతారాం మహాలే ఆ యువకుడికి ఫోన్ చేసి బెదిరించడం మొదలు పెట్టాడు. పోలీస్ స్టేషన్లో జరిగిన తతంగం మొత్తం ఆ యువకుడు మొబైల్ లో రికార్డు చేశాడు. ఎస్ఐ ఫోన్ లో బెదిరించిన సమయంలో మొబైల్ లో రికార్డు చేసుకున్నాడు.

ఎస్ఐ వేధింపులతో విసిగిపోయిన ఆ యువకుడు నేరుగా ఎస్పీ ఎన్, బోస్లే దగ్గరకు వెళ్లి ఎస్ఐ మీద ఫిర్యాదు చేసి సాక్షాలు ఇచ్చాడు. ఎస్ఐ శాంతారాంను సస్పెండ్ చేస్తున్నామని ఎస్పీ బోస్లే ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
PSI Shantaram Mahale demanded Rs 10 lakh from them to let them go. The man, who made audio and video clips of the going-ons at the police station on his cellphone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X