చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియురాలితో పెళ్లి: తర్వాతిరోజే మరో యువతితో..

|
Google Oneindia TeluguNews

Cop tries to marry two girls in 24 hrs
చెన్నై: ప్రేమించిన ప్రియురాలిని పెళ్లి చేసుకున్న 24గంటలు గడవకముందే మరో యువతితో పెళ్లికి సిద్ధమైన ఓ ప్రబుద్ధున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో పెళ్లి విషయం తెలుసుకున్న మొదటి భార్య.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితున్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో గురువారం చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి - చెన్నైనంగనల్లూరుకు చెందిన రంగనాయుడు, మల్లిక దంపతుల కుమారుడు కార్తికేయన్ చెన్నై అడయారు ఏసిబి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. పునిదతోమయార్ మలైకు చెందిన కాల్ సెంటర్ ఉద్యోగిని ఫిలోమినాతో గత ఆరేళ్లుగా ప్రేమాయణాన్ని నడిపాడు. వివాహం చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి చేయడంతో నవంబర్ 6న సంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నాడు.

ఆ తర్వాత తమ వివాహానికి చట్టబద్ధత కల్పించాలని ప్రియురాలు కోరడంతో నవంబర్ 13న చెన్నై రాయపురంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్డ్ వివాహం చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా తిరువణ్ణామలై జిల్లా సెయ్యూరు తాలూకాకు చెందిన మరో యువతితో నవంబర్ 14 గురువారం నాడు కార్తికేయన్ రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. ప్రియురాలితో రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకున్న బుధవారం సాయంత్రమే తన తల్లిదండ్రులు, బంధుమిత్రులతో కలిసి రెండో వివాహం నిమిత్తం కాంచీపురంలోని కల్యాణ మండపానికి చేరుకున్నాడు.

గురువారం ఉదయం 9గంటలకు తన రెండో వివాహానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. అయితే విషయం తెలుసుకున్న తన మొదటి భార్య ఫిలోమినా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులను వెంట తీసుకుని వచ్చిన ఫిలోమినా కళ్యాణ మండపంలోనే కార్తికేయన్‌ను తమ వివాహ విషయంపై ప్రశ్నించింది. దీంతో ఫిలోమినాతో వివాహమైన విషయాన్ని కార్తికేయన్ అంగీకరించాడు. రెండో వివాహాన్ని నిలిపి వేసిన పోలీసులు నిందితుడు కార్తికేయన్‌ను అరెస్ట్ చేశారు.

English summary

 A policeman’s secret plan of marrying two women within a gap of 24 hours was stopped by the police on Thu­rsd­ay when he was prep­ar­ing for the second marria­ge at a hall in Kanc­hipuram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X