వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమర్‌నాధ్ యాత్రలో వింత పోలీసు...! శవాన్ని అనుమతించమంటూ నిలిపివేత...!!

|
Google Oneindia TeluguNews

అమర్‌నాథ్ యాత్రికులకు ఇబ్బంది కల్గుతుందని, యాత్రలో భాగంగా బందోబస్తులో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. భక్తులకు అసౌకర్యం కల్గుతుందని ఓ శవంతో వెళుతున్న అంబులెన్స్‌ను జమ్ముకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. సుమారు రెండు గంటలపాటు నిలిపివేయడంతో చనిపోయిన వ్యక్తి తనయుడు కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగి తన ఆవేదనను సోషల్ మిడియా పోస్టు చేశాడు.దీంతో యాత్ర బందోబస్తులో పోలీసుల తీరుపై పలువురు నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.

కశ్మీర్ పోలీసుల అత్యుత్సాహం...

కశ్మీర్ పోలీసుల అత్యుత్సాహం...

జమ్ము కశ్మీర్ ప్రభుత్వంలో ఆర్ధికశాఖలో డైరక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న ఇంతియాజ్ వాణి యొక్క ఫాదర్ కేన్సర్‌తో భాధపడుతుండడంతో చికిత్స కోసం ఢిల్లిలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పోందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందాడు. దీంతో ఇంతియాజ్ తండ్రి శవాన్ని తీసుకుని కుటుంభ సభ్యులతో కలసి జమ్ముకు బయలు దేరారు. ఈ నేపథ్యంలో శ్రీనగర్ వరకు చేరుకోగానే యాత్ర విధుల్లో ఉన్న జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఇన్స్‌పెక్టర్ రాకేశ్ వాహానాన్ని ముందుకు వెళ్లకుండా ఆపాడు.

భక్తులను తప్ప,శవాలను అనుమతించం

భక్తులను తప్ప,శవాలను అనుమతించం

ఈనేపథ్యంలోనే శవాలను పంపించకూడదని అర్డర్స్ ఉన్నట్టు స్పష్టం చేశాడు. దీంతో శవాన్ని వెల్లకుండా అడ్డుకున్నాడు. దీంతో తానోక ప్రభుత్వ అధికారినని ఇన్స్‌పెక్టర్‌ను వేడుకున్న వదిలేందుకు అనుమతి ఇవ్వలేదని పేర్కోన్నారు. పైగా తనకు భక్తులను మాత్రమే అనుమతించేందుకు అవకాశం ఉందని శవాలను అనుమతించే అధికారం లేదని స్పష్టం చేశాడు. ఇలా రెండు గంటలపాటు అపివేసిన అనంతరం సంప్రదింపుల తర్వాత వదిలిపెట్టినట్టు ఇంతియాజ్ తెలిపారు.

ఎలాంటీ నిబంధనలు లేవు.. పోలీసు అధికారులు

ఎలాంటీ నిబంధనలు లేవు.. పోలీసు అధికారులు

దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఇంతియాజ్ తన ఫేస్ బుక్‌లో పోస్టును పెట్టాడు. ఇది కశ్మీర్ ప్రజల హక్కులను కాలరాస్తుందని అన్నారు.స్థానికలకు పోలీసులు నరకం చూపిస్తున్నారని అన్నారు. ఖచ్చితంగా డెడ్ బాడీలను అనుమతి ఇవ్వమని చెప్పడం చాల దురదృష్టమని అన్నారు. అయితే యాత్రలో ఇలాంటీ నిబంధనలు ఏవీ లేవని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
కాగా యాత్రలో భాగంగా స్థానిక ప్రజలు పోలీసులపై చాల పిర్యాధులు చేశారు. కొన్ని సంధర్భాల్లో అంబులెన్స్‌లు కూడ ఆపారని చెబుతున్నారు.

English summary
A senior official of the Jammu and Kashmir government has alleged that he was stopped while he was carrying his father's body back to Srinagar and made to wait for several hours because of the restrictions due to the ongoing Amarnath Yatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X