వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్టుడికిన సుప్రీంకోర్టు: 144 సెక్ష‌న్ విధింపు: నినాదాల‌తో మారుమోగిన ఆవ‌ర‌ణ‌

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆవ‌ర‌ణ‌లో మంగ‌ళవారం క‌నీవినీ ఎరుగ‌ని ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌హిళా సంఘాల ప్రతినిధులు, మ‌హిళా న్యాయ‌వాదులు సుప్రీంకోర్టును ముట్ట‌డించారు. పెద్ద ఎత్తున నిర‌స‌న చేప‌ట్టారు. సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ‌లోనే బైఠాయించారు. ధ‌ర్నాకు దిగారు. ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ మొత్తం మ‌హిళా సంఘాల ప్ర‌తినిధుల‌తో కిట‌కిట‌లాడింది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్లిస్ రంజ‌న్ గొగొయ్ వ్య‌తిరేక నినాదాల‌తో మారుమోగిపోయింది. లైంగిక వేధింపుల కేసులో రంజ‌న్ గొగొయ్‌కు క్లీన్ చిట్ ఇవ్వ‌డాన్ని త‌ప్పుప‌డుతూ పెద్ద ఎత్తున మ‌హిళా సంఘాలు సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ‌లో నిర‌స‌న తెలియ‌జేశారు. దీనికోసం పెద్ద సంఖ్య‌లో మ‌హిళ‌లు సుప్రీంకోర్టు వ‌ద్ద‌కు త‌ర‌లి వ‌చ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘ‌ట‌న‌తో సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీనితో 144 సెక్ష‌న్‌ను విధించారు.

రంజ‌న్ గొగొయ్‌కు క్లీన్‌చిట్ ఇవ్వ‌డాన్ని త‌ప్పుప‌ట్టిన మ‌హిళ‌లు

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రంజ‌న్ గొగొయ్‌పై లైంగిక వేధింపుల కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. దీనిపై విచార‌ణ చేయ‌డానికి ముగ్గురు స‌భ్యుల ధ‌ర్మాసనం ఏర్పాటైంది. బాధితురాలిగా భావిస్తోన్న మ‌హిళ స‌హా రంజ‌న్ గొగొయ్ వాద‌న‌ల‌ను విన్న అనంత‌రం ఈ ధ‌ర్మాస‌నం కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. గొగొయ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ మేర‌కు సోమ‌వార‌మే ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. ఇది కాస్తా మ‌హిళా సంఘాల‌కు ఆగ్ర‌హాన్ని క‌లిగించింది. గొగొయ్‌ను ర‌క్షించ‌డానికి సుప్రీంకోర్టు ప్ర‌య‌త్నించిందంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు.

Cops Remove Protestors From SC, Sec 144 Imposed

సుప్రీంకోర్టు ముట్ట‌డి..

అక్క‌డితో ఆగ‌లేదు- ఏకంగా సుప్రీంకోర్టును ముట్టడించారు. సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ‌కు చేరుకుని నినాదాలు చేశారు. ధ‌ర్నాకు దిగారు. అక్క‌డే బైఠాయించారు. ఒక‌వంక సుప్రీంకోర్టు రోజువారీ కార్య‌క‌లాపాలు కొన‌సాగుతున్న ద‌శ‌లోనే- మ‌రోవంక‌- మ‌హిళ‌లు పెద్ద ఎత్తున గుడికూడి నినాదాలు చేశారు. ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. గొగొయ్‌కు వ్యతిరేకంగా వారు చేసిన నినాదాల‌తో సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ మారుమోగిపోయింది. మ‌హిళా సంఘాలు ముట్ట‌డిస్తామ‌ని ముందుగానే స‌మాచారం ఉండ‌టంతో పెద్ద ఎత్తున పోలీసులు బ‌ల‌గాల‌ను అక్క‌డ మోహ‌రింప‌జేశారు.

Cops Remove Protestors From SC, Sec 144 Imposed

సుప్రీంకోర్టును ముట్ట‌డించ‌డానికి వచ్చిన మ‌హిళ‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. వారిని సుప్రీంకోర్టు భ‌వ‌న స‌ముదాయంలోనికి ప్ర‌వేశించ‌కుండా అడ్డుకున్నారు. ఫ‌లితంగా- ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప‌రిస్థితిని అదుపులోకి తీసుకుని రావ‌డానికి సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ‌లో 144 సెక్ష‌న్‌ను విధించారు. మ‌హిళ‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్ర‌త్యేక వాహ‌నాల్లో మందిర్ మార్గ్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

English summary
Section 144 has been imposed outside the Supreme Court following massive protests against clean chit given to CJI Ranjan Gogoi in the sexual harassment case against him. Many women protestors were forcibly removed by the police from outside the premise, put into a van and taken to the Mandir Marg police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X