వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Corna Lockdown: డ్రోన్లకు క్రికెట్ కామెంట్రీ, తుపాకి కాల్పులు, దెబ్బకు దౌడ్, వైరల్ వీడియో!

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం/ గురువాయర్: కరోనా వైరస్ ను (COVID 19) అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ విధించినా ప్రజలు ఏమాత్రం చెప్పిన మాట వినడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. పోలీసులు ఏమైనా ప్రశ్నిస్తే సినిమా స్టోరీలు చెబుతున్నారు. కేరళలో స్థానిక ప్రజల తీరుపై పోలీసులు విసిగిపోయారు. ఎంత చెప్పినా రోడ్ల మీద, గ్రామాల్లో సోల్లు కబర్లు చెప్పుకుంటూ గుంపులు గుంపులుగా ఉండటం గమనించిన పోలీసులు వారికి ఎలాగైనా బుద్ది చెప్పాలని నిర్ణయించారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్న వారిని గుర్తించడానికి డ్రోన్లు వదలడంతో ప్రస్తుతం కేరళ ప్రజలు రోడ్ల మీద నుంచి ఇళ్లలోకి, పోలాల్లోకి, ఎక్కడికి పడితే అక్కడికి పరుగు తీసస్తున్నారు. డ్రోన్లకు క్రికెట్ కామెంట్రీ, తుపాకి కాల్పుల సౌండ్స్ తో స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించడంతో కేరళ ప్రజలు దౌడ్ అంటున్నారు. ఆ వీడియోలను కేరళ పోలీసులు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

Coronavirus: బెంగళూరులో 59 కరోనా పాజిటివ్ కేసులు, క్వారంటైన్ లో 14 వేల మంది, లింక్ !Coronavirus: బెంగళూరులో 59 కరోనా పాజిటివ్ కేసులు, క్వారంటైన్ లో 14 వేల మంది, లింక్ !

కేరళ పోలీసులకు కరోనా కష్టాలు

కేరళ పోలీసులకు కరోనా కష్టాలు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ ను అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. కేరళలో సైతం కరోనా వైరస్ ను అరికట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కేరళలో పోలీసులకు కరోనా కష్టాలు ఎక్కువ అయ్యాయి.

విసిగిపోయిన కేరళ పోలీసులు

విసిగిపోయిన కేరళ పోలీసులు

లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించరాదని, ఇళ్లలోనే ఉండాలని కేరళ పోలీసులు స్థానిక ప్రజలు ఎంతా చెప్పినా వినలేదు. పోలీసులు వెళ్లిన సమయంలో ప్రజలు ఇళ్లలోకి వెళ్లడం, వారు వెళ్లిపోయిన తరువాత మళ్లీ రోడ్ల మీదకు రావడం చేస్తున్నారు. విసిగిపోయిన కేరళ పోలీసులు ఎలాగైనా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా చెయ్యాలని నిర్ణయించారు. రోడ్ల మీద పదేపదే తిరుగుతున్న వారి వివరాలు సేకరించి వారికి సరైన సమాధానం ఇవ్వాలని నిర్ణయించారు.

రంగంలోకి డ్రోన్లు దింపితే !

కేరళ పోలీసులు డ్రోన్ల సహాయంతో రోడ్ల మీద తిరుగుతున్న వారిని గుర్తించాలని నిర్ణయించారు. డ్రోన్లకు క్రికెట్ కామెంట్రీ, తుపాకి కాల్పులు ఉన్న సౌండ్స్ తో స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించి గాల్లో వదిలిపెట్టారు. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన డ్రోన్ల నుంచి పెద్ద ఎత్తున క్రికెట్ కామెంట్రీలు, తుపాకి కాల్పుల సౌండ్స్ రావడంతో రోడ్ల మీద ఉన్న ప్రజలు దిక్కుతోచక ఎక్కడపడితే ఆ పక్కకు పరుగు తీశారు.

చెట్లు పుట్టలు, వాగులు వంకలు తేడా లేకుండా !

చెట్లు పుట్టలు, వాగులు వంకలు తేడా లేకుండా !

పోలీసులు వదిలిన డ్రోన్లు చూసిన ప్రజలు చెట్లు పుట్టలు, వాగులు, పోలాలు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడికి పరుగు తీస్తున్నారు. డ్రోన్లలోని కెమెరాల కంటికి చిక్కితే పోలీసులు చితకబాదుతారనే భయంతో కేరళ ప్రజలు పరుగు తీస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను కేరళ పోలీసులు స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వేల మంది పోలీసులు కోట్ల మంది ప్రజలను ఇళ్లలోకి పంపించడం సాధ్యం కాకపోవడంతో ఇలా డ్రోన్లు ఉపయోగించి వారికి భయం పెడుతున్నారు. మొత్తం మీద కేరళ పోలీసులు డ్రోన్లతో ప్రజలను భయపెడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

English summary
Kerala Police using drones to caught the people who will not follow nationwide lockdown rules. Police posted a drone video on twitter now video goes viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X