చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coroanvirus: పెళ్లి జరిగిన గంటలో షాక్, పెళ్లి కుమార్తెకు కరోనా, చెన్నైలో ఉద్యోగం, ఫ్యామిలీ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ సేలం: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. కరోనా వైరస్ దెబ్బకు ఎవరి ఇంట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ? చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు. కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్బంగా ఐదు నెలల క్రితం నిశ్చయం అయిన పెళ్లిని కేవలం ఐదు మంది సమక్షంలో ఇంట్లోనే జరిపించారు. అయితే పెళ్లి జరిగి ఒక గంట కూడా కాకముందే పెళ్లి కుమార్తెకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని వెలుగు చూసింది. నవ దంపతులతో పాటు అందర్నీ క్వారంటైన్ కు తరలించారు. కరోనా వైరస్ దెబ్బకు నవ దంపతులు దూరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?

చెన్నైలో పెళ్లి కూతురు ఉద్యోగం

చెన్నైలో పెళ్లి కూతురు ఉద్యోగం

తమిళనాడులోని సేలం జిల్లా గంగవళ్ళికి చెందిన 26 ఏళ్ల యువతి చెన్నైలోని వడపళని ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. పెళ్లి కుమార్తె సొంత ఊరు అయిన గంగవళ్ళిలోనే 28 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. ఒకే ఊరి కావడంతో యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి వారి కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు.

జనవరిలో నిశ్చితార్థం

జనవరిలో నిశ్చితార్థం

గంగవళ్ళికి చెందిన యువతి, యువకుడికి మే 24వ తేదీ పెళ్లి చెయ్యాలని జనవరి నెలలోనే వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. జనవరి నెలలోనే యువతి, యువకుడికి వివాహ నిశ్చితార్థం జరిగిపోయింది. ఐదు నెలల క్రితం వివాహం నిశ్చయం కావడం, కరోనా వైరస్ సందర్బంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో వారి కుటంబ సభ్యులు నెల నుంచి ఆందోళన చెందారు.

చెన్నై దెబ్బకు పెళ్లి కుమార్తెకు కరోనా

చెన్నై దెబ్బకు పెళ్లి కుమార్తెకు కరోనా

చెన్నైలో ఉద్యోగం చేస్తున్న పెళ్లి కుమార్తె సొంత ఊరు అయిన గంగవళ్ళికి చేరుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు యువతికి కరోనా వైరస్ వైద్యపరీక్షలు చేయించి ఆమెను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. యువతి ఇంటికి చేరుకోవడంతో ఐదు నెలల క్రితం నిర్ణయించిన ముహూర్తం మే 24వ తేదీ ఆదివారం పెళ్లి జరిపించాలని పెద్దలు నిర్ణయించారు.

పెళ్లి జరిగిన గంటకే షాక్

పెళ్లి జరిగిన గంటకే షాక్

పెళ్లి కుమార్తెను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చెయ్యడంతో గుడిలో జరగాల్సిన పెళ్లి ఇంట్లోకి మారిపోయింది. పెళ్లి కుమార్తె ఇంటిలో కేవలం ఐదు మంది సమక్షంలో ఆదివారం యువతి వివాహం జరిగింది. యువతి మెడలో తాళి కట్టిన పెళ్లి కొడుకు అత్తారింటిలో సంతోషంగా ఉన్న సమయంలో అధికారులు పెళ్లి జరిగిన ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు.
పెళ్లి కుమార్తెకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని అధికారులు చెప్పడంతో నవ దంపతులు కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు.

Recommended Video

Groom Tied Mobile Phone Instead of Bride's Neck, World First Online Wedding Going Viral
ఐసోలేషన్ వార్డులో పెళ్లి కుమార్తె

ఐసోలేషన్ వార్డులో పెళ్లి కుమార్తె

పెళ్లి జరిగిన గంటకే పెళ్లి కుమార్తెను అధికారులు ప్రత్యేక వాహనంలో సేలంలోని కరోనా ఐసోలేషన్ వార్డుకు తరలించారు. పెళ్లి కుమారుడితో పాటు అతని కుటుంబ సభ్యులు, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులను కరోనా క్వారంటైన్ కు తరలించారు. పెళ్లి జరిగిన గంటకే కరోనా వైరస్ దెబ్బకు నవ దంపతులు వేరుకావడంతో, పెళ్లి కుమార్తెకు కరోనా వైరస్ ఉందని వెలుగు చూడటంతో వారి కుటంబ సభ్యులు షాక్ కు గురైనారు.

English summary
Coroanvirus: Bride corona infection quarantine near Salem in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X