వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకరోజులో తగ్గిన 3 వేల 565 కేసులు, 4 శాతం తగ్గుదలతో 86 వేల మార్క్ వద్ద యాక్టివ్ కేసులు...

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. రోజుకి కనీసం 6 నుంచి 8 వేల కేసులు నమోదవతున్నాయి. శుక్రవారం 7 వేల 964 పాజిటివ్ కేసులతో ఆ సంఖ్య లక్ష 73 వేల 763కి చేరింది. లక్ష 65 వేల 799 నుంచి లక్ష 70 వేల మార్క్ చేరింది. కేసుల నమోదు 4.8 శాతం పెరగగా.. మరణాలు 4 వేల 971కి చేరింది. 265 మంది చనిపోయారని వైద్యారోగ్యశాఖ రిపోర్ట్ చేసింది.

గగనతలంలో విమానం: పైలట్‌కు కరోనా పాజిటివ్, సిబ్బంది అలర్ట్, ఉజ్బెకిస్తాన్ నుంచి ఖాళీగా వెనక్కి..గగనతలంలో విమానం: పైలట్‌కు కరోనా పాజిటివ్, సిబ్బంది అలర్ట్, ఉజ్బెకిస్తాన్ నుంచి ఖాళీగా వెనక్కి..

3 వేల పైచిలుకు....

3 వేల పైచిలుకు....


కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న.. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం ఊరట కలిగిస్తోంది. శుక్రవారం వైరస్ కేసుల సంఖ్య 3 వేల 565 తగ్గింది. 4 శాతం కేసులు తగ్గడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 89 వేల 987 నుంచి 86 వేల 422కి చేరింది. మరోవైపు ఒకరోజులో 11 వేల 264 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో వైరస్ బారినపడి వారి శాతం 4.5 నుంచి 47.4 శాతానికి చేరింది. కానీ 265 మంది చనిపోవడంతో మరణాల శాతం 2.9 శాతంగా ఉంది.

5 రోజుల నుంచి తగ్గుముఖం

5 రోజుల నుంచి తగ్గుముఖం

గత 5 రోజుల నుంచి వైరస్ సోకిన వారి సంఖ్య 4.6 శాతంగా నమోదై.. ఆల్ టైం లోగా రికార్డైంది. ఒక్కరోజులో నమోదైన కేసులవారీగా చూస్తే.. ఢిల్లీలో 1105, తమిళనాడు 874, కర్ణాటక 274, హర్యానా 217, ఉత్తరాఖండ్ 216, తెలంగాణ 169, అసోం 168, మేఘాలయా 6 కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో మాత్రం కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.

మహారాష్ట్రలో కంటిన్యూ

మహారాష్ట్రలో కంటిన్యూ

శుక్రవారం 2 వేల 682 కేసులు నమోదై.. మొత్తం కేసుల సంఖ్య 62 వేల 228కి చేరింది. గత 13 రోజుల నుంచి రోజుకు 2 వేల చొప్పున కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత తమిళనాడు ఉంది. 874 కేసులతో ఒక్కరోజులో అత్యధిక కేసులు రికార్డయ్యాయి. రోజు 400 అంతకన్నా ఎక్కువ కేసులు నమోదవడంతో కేసుల సంఖ్య 20 వేల 246కి చేరింది. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 17 వేల 386కి చేరింది. గుజరాత్‌లో గత 31 రోజుల నుంచి 300 కేసులు నమోదవుతున్నాయి. శనివారం కూడా 372 కేసులు నమోదయ్యాయి.

English summary
number of active cases in India has declined by 3,565 – down 4% to 86,422 from 89,987 on Friday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X