• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా ప్రభావంతో తల్లక్రిందులైన జీవితం .. కూరగాయలు అమ్ముకుంటున్న డైరెక్టర్

|

కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను తారుమారు చేసింది. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారందరిని ఒక్కసారిగా నిరుద్యోగులుగా మార్చింది. బడా వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను సైతం కుదేలు చేసింది. ఇక సినీ పరిశ్రమలోనూ ,మీడియా రంగంలోనూ పనిచేసే చాలా మందిని బజారున పడేసింది. మంచి పేరు సంపాదించిన కళాకారులు , దర్శకుల బతుకులను కరోనా తల్లక్రిందులు చేసింది .

రాజకీయ నేతలకు కరోనా టెన్షన్ .. డిప్యూటీ స్పీకర్ తో పాటు ఒకేసారి 11 మంది ఎమ్మెల్యేలకు పాజిటివ్రాజకీయ నేతలకు కరోనా టెన్షన్ .. డిప్యూటీ స్పీకర్ తో పాటు ఒకేసారి 11 మంది ఎమ్మెల్యేలకు పాజిటివ్

వివిధ రంగాల్లో లక్షలాది మందిని రోడ్డున పడేసిన కరోనా

వివిధ రంగాల్లో లక్షలాది మందిని రోడ్డున పడేసిన కరోనా

కరోనా కారణంగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ బతుకు జీవుడా అంటూ వివిధ వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు చాలా మంది ప్రముఖులు. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప, మిగతా వారెవరికీ ఆదాయ మార్గాలు లేకుండాపోయాయి. కరోనా వైరస్ కారణంగా ఉద్యోగం పోవడంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూరగాయల అమ్ముకుంటూ జీవనం సాగించడం చర్చనీయాంశం కాగా, ఆ తర్వాత ఓ ప్రైవేట్ టీచర్ అరటి పండ్లు అమ్ముకుంటూ బతుకుదెరువు కోసం తిప్పలు పడిన ఉదంతాలు తెలిసినవే.

కరోనా సంక్షోభంలో బాలికా వధు ఎపిసోడ్ డైరెక్టర్

కరోనా సంక్షోభంలో బాలికా వధు ఎపిసోడ్ డైరెక్టర్


లక్షల సంఖ్యలో కరోనా దెబ్బకు ఉపాధి పోగొట్టుకున్న వారు ఏదో ఒక పని చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. తాజాగా హిందీలో సూపర్ హిట్ అయిన, దేశవ్యాప్తంగా ప్రజల నుండి మంచి ఆదరణ పొందిన బాలికా వధు సీరియల్ ఎపిసోడ్ డైరెక్టర్ రామ్ వృక్ష గౌర్ లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. బాలిక వధుకు ఎపిసోడ్ డైరెక్టర్‌గా ఉన్న గౌర్ ఒక సినిమా కోసం పని చేయాల్సి ఉండగా, లాక్డౌన్ ప్రకటించినప్పుడు అతను తన సొంత ఊరికి వెళ్ళిపోయారు. అయితే లాక్ డౌన్ అనంతరం కూడా ఆయన పనిచేస్తున్న ప్రాజెక్ట్ ను ఆపివేయవలసి వచ్చింది .

 సినిమాలు ఆగిపోవటంతో ఉపాధి కోల్పోయిన డైరెక్టర్

సినిమాలు ఆగిపోవటంతో ఉపాధి కోల్పోయిన డైరెక్టర్

ఈ చిత్ర నిర్మాత గౌర్ కు తిరిగి చిత్ర నిర్మాణం చేయడానికి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తెలియజేశారు. దీంతో ప్రస్తుతం టెలివిజన్ రంగంలోనూ, సినీ రంగంలోనూ కరోనా కారణంగా పెద్దగా ఉపాధి దొరకకపోవడంతో, రాం వృక్ష గౌర్ కూరగాయలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. హిందీతో పాటు, భోజపురి సినిమాలు ఇప్పటికే కమిట్ అయిన ఈ దర్శకుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, నిర్మాతలు సహకరించకపోవడంతో సినిమాలను తీయలేక పోతున్నారు.

 కూరగాయలు అమ్ముకుంటూ జీవనం

కూరగాయలు అమ్ముకుంటూ జీవనం

దాంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దర్శకుడు రాం వృక్ష గౌర్ ఎవరిని ఆర్థిక సహాయం అడగలేక కూరగాయల వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయితే తన తండ్రి కూడా కూరగాయల వ్యాపారం చేసే వారిని, కూరగాయల వ్యాపారం చేయడంలో తనకు ఎలాంటి నామోషి లేదని ఆయన చెప్పడం విశేషం. కాగా ఒక మంచి దర్శకుడికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

English summary
Ram Vriksha Gaur, who worked as the episode director of Balika Vadhu, is living by selling vegetables as he cannot find much employment due to corona.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X