హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా ప్రబలుతున్నా.. ప్రభుత్వ అధికారి నిర్లక్ష్యం: ఢిల్లీ వెళ్లి వచ్చి విధులకు, కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో తెలుగు రాష్ట్రాలపాటు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీకి వెళ్లి వచ్చినవారికి కరోనా లక్షణాలున్నప్పటికీ పలువురు తమ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేయకపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

తెలంగాణ నుంచి 1300 మందికి ఢిల్లీకి..

తెలంగాణ నుంచి 1300 మందికి ఢిల్లీకి..

తెలంగాణ నుంచి కూడా 1300 మంది వరకు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో చాలా మంది ఇప్పటికే ఆస్పత్రుల్లో చేరినప్పటికీ పలువురు మాత్రం ముందుకు రాకపోవడంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే కోరింది. లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

ఢిల్లీ నుంచి వచ్చి నిర్లక్ష్యంగా ప్రభుత్వాధికారి..

ఢిల్లీ నుంచి వచ్చి నిర్లక్ష్యంగా ప్రభుత్వాధికారి..


తాజాగా, ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారిలో ఒక తెలంగాణ ప్రభుత్వ అధికారి కూడా ఉండటం గమనార్హం. అయితే, అతడు తన ఢిల్లీ పర్యటనను దాచి పెట్టి విధులకు హాజరవుతున్నాడు. ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తికి కారణమైన జనగామ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో అడ్మిన్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ ఖాజా మొహీనుద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

పలు సెక్షన్ల కింద కేసు నమోదు..

ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ప్రభుత్వ సదరు ప్రభుత్వ అధికారిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక సీఐ మల్లేష్ తెలిపారు. ఐపీసీ సెక్షన్ 269, 270(ఇతరులకు ప్రాణహాని తలపెట్టే విధంగా ప్రవర్తించడం, ఐపీసీ సెక్షన్ 188(ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం) కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Recommended Video

Corona Came into Light 7 Years Ago Only | Leading News Paper News In 2013 Going Viral now
బాధ్యతారహితంగా వ్యవహరించి..

బాధ్యతారహితంగా వ్యవహరించి..

ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లీఘీ జమాత్ నుంచి వచ్చిన వారి నుంచి కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసి కూడా నిర్లక్ష్యంగా సదరు అధికారి విధులకు హాజరయ్యాడని సీఐ తెలిపారు. మార్చి 21, 23, 27 తేదీల్లో విధులకు హాజరై అధికారులు, సిబ్బందితో సన్నిహితంగా మెలిగి బాధ్యతారహితంగా వ్యవహరించాడని చెప్పారు. ప్రభుత్వం కోరినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు తెలిపారు. అయితే, సదరు అధికారికి కరోనా లక్షణాలున్నాయా? ఉంటే. అతని వల్ల ఎవరికైనా లక్షణాలు సోకాయా? అనేది తేలాల్సి ఉంది.

English summary
corona: case filed on jangaon govt officer, who went to delhi markaz prayers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X