వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు... 24 గంటల్లో కొత్త కేసులు 34,956, మరణాలు 687

|
Google Oneindia TeluguNews

భారతదేశం కరోనా కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే భారతదేశంలో ఉన్న కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటేసింది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడచిన 24 గంటల్లో ఇండియాలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 34,956కేసులు నమోదైన తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు నమోదైన కేసులలో ఇవే అత్యధిక కేసులు కావటం ఇండియాలో కరోనా ఉధృతిని చూపిస్తుంది.

ఖరీఫ్ సాగుకు కరోనా గండం ... వ్యవసాయ కూలీలకొరతతో విపరీతంగా కూలీ రేట్లుఖరీఫ్ సాగుకు కరోనా గండం ... వ్యవసాయ కూలీలకొరతతో విపరీతంగా కూలీ రేట్లు

ఇండియాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,03,832

ఇండియాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,03,832

ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,03,832కి చేరింది.ఇందులో 3,42,473 యాక్టివ్ ఉంటె, 6,35,757 మంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 687 కరోనా మరణాలు సంభవించాయి.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 25,602కి చేరింది.పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ ను విధించారు.మరికొన్ని రాష్ట్రాలు ఇదే బాటలో నడిచేందుకు సిద్ధం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య గురువారం రాత్రికి 25,553కి చేరుకుంది.

రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు

రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు

నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 8641, తమిళనాడులో 4549, కర్ణాటకలో 4169, ఆంధ్రప్రదేశ్లో 2593, పశ్చిమబెంగాల్లో 1690, ఉత్తరప్రదేశ్లో 2058, ఢిల్లీలో 1652 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు . ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అమెరికా మొదటి స్థానంలో, బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉన్నాయి. భారతదేశం మూడో స్థానంలో కొనసాగుతుంది.

కరోనా పరీక్షల్లో అమెరికా టాప్... రెండో స్థానంలో ఇండియా

కరోనా పరీక్షల్లో అమెరికా టాప్... రెండో స్థానంలో ఇండియా

రికార్డు స్థాయిలో 42 మిలియన్ల కరోనా పరీక్షలు నిర్వహించింది యుఎస్ . ఆ తరువాత, భారతదేశం రెండవ స్థానంలో కరోనా పరీక్షల నిర్వహణలో ఉంది . ఇప్పటివరకు ఇండియా 12 మిలియన్ల కరోనావైరస్ పరీక్షలను చేసిందని వైట్ హౌస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా, 13.6 మిలియన్లకు పైగా పాజిటివ్ పరీక్షలు చేయగా, 586,000 మందికి పైగా మరణించారు.కరోనావైరస్ పరీక్షకు సంబంధించి,యూఎస్ 42 మిలియన్లకు పైగా పరీక్షలు చేసాము. రెండవ అత్యధిక సంఖ్య భారతదేశం నుండి 12 మిలియన్లు టెస్టులు అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్ ఎనానీ అన్నారు.

Recommended Video

Sourav Ganguly In Home Quarantine After His Brother Tests Covid-19 Positive || Oneindia Telugu
మూడు రోజుల్లో 9 లక్షల నుండి 10 లక్షలు దాటిన కరోనా కేసులు

మూడు రోజుల్లో 9 లక్షల నుండి 10 లక్షలు దాటిన కరోనా కేసులు

భారతదేశం 1 మిలియన్ కేసులను దాటింది. 3 రోజుల్లో 9 లక్షల నుండి 10 లక్షల వరకు కేసులు పెరిగాయి . రోజువారీ కొత్త కేసులలో దాదాపు 35 వేల కేసుల పెరుగుదల ఇండియాలో కనిపిస్తుంది . దక్షిణాది రాష్ట్రాల నుంచి కొత్త కేసుల్లో 38 శాతం పెరిగింది . భారతదేశం యొక్క రికవరీ రేటు 63 శాతం నుండి 63.3 శాతానికి మెరుగుపడుతుంది. భారతదేశంలో మరణాలు 25 వేలను దాటాయి .

English summary
India crossed the 10-lakh COVID-19 cases mark, becoming the third country in the world . India's total COVID-19 caseload stands at 10,03,832, with total cases rising by 34,956 in the last 24 hours. The death toll rose by 687 in the last 24 hours to an overall tally of 25,602.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X