వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

68లక్షలు దాటిన కరోనా కేసులు .. సమైక్యంగా కరోనాతో పోరాటం చేద్దాం.. ప్రధాని మోడీ ట్వీట్

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా పంజా విసురుతూనే ఉంది. నిత్యం వేలాదిసంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి . కోవిడ్ -19 కారణంగా అమెరికా, బ్రెజిల్ మరణాల తర్వాత ప్రపంచంలో అత్యధిక మరణాలను నమోదు చేసిన మూడవ దేశంగా భారత్ నిలిచింది. గత 24 గంటల్లో ఇండియాలో 78,524 కొత్త కేసులు నమోదు కాగా 971 మరణాలు నమోదయ్యాయి. భారత దేశ కరోనా కేసుల సంఖ్య గురువారం 68 లక్షలను దాటింది.

కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక .. ప్రతి పది మందిలో ఒకరికి కరోకరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక .. ప్రతి పది మందిలో ఒకరికి కరో

దేశంలో 68 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 68 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 68,35,656 గా ఉంది . వీటిలో 9,02,425 క్రియాశీల కేసులు ఉండగా , 58,27,705 కేసులు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు . కరోనా కారణంగా 1,05,526 మరణాలు సంభవించాయి. భారతదేశ కరోనా రికవరీలు మేలో 50,000 ఉండగా , అవి అక్టోబర్లో 57 లక్షలకు పైగా పెరిగాయి. ముఖ్యంగా, ప్రతి రోజు 75,000 కంటే ఎక్కువ రికవరీలు ఇండియాకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి . రికవరీలు 6.3 రెట్లు పెరగటం ఒకింత ఊరటనిస్తుంది .

 కరోనా కేసుల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర , తర్వాత స్థానాల్లో ఉన్న రాష్ట్రాలివే

కరోనా కేసుల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర , తర్వాత స్థానాల్లో ఉన్న రాష్ట్రాలివే

మహారాష్ట్ర లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. దేశంలోనే కరోనా కేసుల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది . ఆ తర్వాత స్థానాల్లో ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక , తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి . దేశ వ్యాప్తంగా రికవరీల రేటు చూస్తే 85.25 శాతంగా నమోదైంది. ఇక యాక్టివ్ కేసుల శాతం13.20 కాగా నమోదవుతున్న కేసుల్లో మొత్తంగా చూస్తే మరణాల రేటు 1.54 శాతానికి తగ్గినట్లు కేంద్రం పేర్కొంది.

గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,94,321 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది . ఇక ఇప్పటివరకు మొత్తం దేశవ్యాప్తంగా 8,34,65,975 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేసినట్లు పేర్కొంది.

 కరోనాపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యం కోరుతున్న పీఎం మోడీ

కరోనాపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యం కోరుతున్న పీఎం మోడీ

కోవిడ్ -19 కి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించటం మరియు చేతుల పరిశుభ్రత పాటించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. భారతదేశం యొక్క COVID-19 పోరాటంలో ప్రజలు భాగస్వామ్యం తీసుకుంటున్నారు . మా కరోనా వారియర్స్ అందుకు కావాల్సిన బలాన్ని ఇస్తున్నారు అని పేర్కొన్నారు.

Recommended Video

Donald Trump : నిబంధనలకు విరుద్ధంగా Trump పోస్ట్.. నిర్మోహమాటంగా తొలగించిన Facebook || Oneindia
ట్విట్టర్ ద్వారా ప్రజలకు సందేశం .. సమైక్యంగా పోరాడదాం అంటూ

ట్విట్టర్ ద్వారా ప్రజలకు సందేశం .. సమైక్యంగా పోరాడదాం అంటూ

మా సామూహిక ప్రయత్నాలు చాలా మంది ప్రాణాలను కాపాడటానికి సహాయపడ్డాయి. ఇప్పుడు ఈ ఉద్యమం ఊపందుకుంది . మన పౌరులను వైరస్ నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. # Unite2FightCorona అని పీఎం మోడీ తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేశారు . భారత్ తో పాటు అమెరికా, బ్రెజిల్ దేశాల్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించినా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా కరోనాపై ప్రపంచం సాగిస్తున్న సమరంలో , అటు కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ భారత్ క్రియాశీలంగా వ్యవహరిస్తోంది .

English summary
India's Covid-19 tally crossed the 68-lakh mark on Thursday with a spike of 78,524 new cases & 971 deaths reported in the last 24 hours. With this, the total case tally stands at 68,35,656 including 9,02,425 active cases
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X