వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో 90 లక్షలు దాటిన కరోనా కేసులు.. ప్రపంచంలోనూ 56.8 మిలియన్ల కేసులు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్న రెండు మూడు రోజులపాటు కరోనా కేసులు తగినట్టే కనిపించినా మళ్లీ క్రమంగా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ను వ్యాక్సిన్ లేకుండానే అధిగమించాల్సిన పరిస్థితి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి.

శబరిమలకు వెళ్ళే భక్తుల కోసం హెల్ప్ లైన్ ప్రారంభం ... కరోనా సమయంలో భక్తుల భద్రతకు ప్రాధాన్యం శబరిమలకు వెళ్ళే భక్తుల కోసం హెల్ప్ లైన్ ప్రారంభం ... కరోనా సమయంలో భక్తుల భద్రతకు ప్రాధాన్యం

 45,882 కొత్త కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,04,365

45,882 కొత్త కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,04,365

భారత దేశంలో తాజాగా నమోదైన కరోనా కొత్త కేసుల విషయానికి వస్తే శుక్రవారం 45,882 కేసులతో భారత దేశ కరోనా కేసులు 90 లక్షలను దాటాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,04,365కు చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 84,28,410మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,43,794 క్రియాశీల కేసులు ప్రస్తుతం ఉన్నాయి. 584 కొత్త మరణాలతో, మొత్తం మరణాల సంఖ్య 1,32,162 కు పెరిగింది.

వరుసగా పదమూడవ రోజు... ఒకేరోజులో 50,000 కన్నా తక్కువ కేసులు

వరుసగా పదమూడవ రోజు... ఒకేరోజులో 50,000 కన్నా తక్కువ కేసులు

భారతదేశం ఒక రోజులో 50,000 కన్నా తక్కువ కేసులను నమోదు చేసిన వరుసగా పదమూడవ రోజు ఇది.నవంబర్ 7న చివరిసారిగా రోజువారీ కొత్త కేసులు 50,000 పరిమితిని దాటాయి . కొత్త రికవరీలు గత 47 రోజుల నుండి రోజువారీ కొత్త కేసులను నిరంతరం అధిగమిస్తూనే ఉన్నాయి. ఇక కరోనా కారణంగా దేశంలో మరణాల రేటు చూస్తే 1.46 శాతంగా ఉంది. రికవరీ రేటు 93.6 శాతంగా ఉంది. ప్రస్తుతం మొత్తం కేసులలో క్రియాశీలకంగా ఉన్న కేసుల రేటు 4.92 శాతంగా ఉంది.

దేశంలోని 10 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు 77. 28 శాతం కరోనా కొత్త కేసుల నమోదు

దేశంలోని 10 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు 77. 28 శాతం కరోనా కొత్త కేసుల నమోదు

దేశంలోని 10 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు 77. 28 శాతం కరోనా కొత్త కేసులను నమోదు చేశాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో కరోనాకేసుల సంఖ్య 7,486 కాగా, కేరళలో 6,419 గా నమోదైంది. మహారాష్ట్రలో 5,011 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ కొత్త కేసుల పెరుగుదల , రోజువారీ మరణాల పెరుగుదలతో ఢిల్లీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఢిల్లీలో కరోనా నియంత్రణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

 ప్రపంచవ్యాప్తంగా 56.8 మిలియన్ల ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 56.8 మిలియన్లకు

ప్రపంచవ్యాప్తంగా 56.8 మిలియన్ల ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 56.8 మిలియన్లకు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు చూస్తే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 56.8 మిలియన్లకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది . కరోనా కారణంగా సంభవించినా మరణాలు 1.35 మిలియన్లకు పైగా పెరిగాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేసుల సంఖ్య 5,68,17,667 కాగా ఇప్పటివరకు కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల సంఖ్య 13,58,489 వద్ద ఉందని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) శుక్రవారం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా అత్యధికంగా దెబ్బతిన్న దేశం అమెరికా. అమెరికాలో ఇంకా కరోనా పంజా కొనసాగుతూనే ఉంది .

English summary
India's COVID-19 tally crossed the 90-lakh mark with 45,882 confirmed cases on Friday, according to the Union Ministry of Health and Family Welfare. The country's Covid-19 tally has risen to 90,04,365 including 84,28,410 recoveries and 4,43,794 active cases. With 584 new deaths, the cumulative count mounted to 1,32,162.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X