కరోనాకేసుల ఊగిసలాట: 3,207 కొత్తకేసులు; 29 మరణాలు; అయినా బీఅలెర్ట్!!
భారతదేశంలో కరోనా కేసుల మధ్య ఊగిసలాట కొనసాగుతోంది. కొద్దిపాటి హెచ్చుతగ్గులతో కరోనా కేసులు నిత్య నమోదవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశంలో సోమవారం 3,207 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 29 మరణాలు గత 24 గంటల్లో నమోదయ్యాయి. అదే సమయంలో 3,410 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కరోనా కేసులు కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,403కి చేరుకుంది.
గత 24 గంటల్లో 3.36 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4.31కోట్ల మందికి పైగా కరోనా మహమ్మారి బారిన పడగా 5.24లక్షలమంది కరోనా మహమ్మారి కి బలైపోయారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల రేటు 0.05శాతంగా ఉంది ఇక రికవరీ రేటు 98. 74 శాతంగా ఉంది. నిన్న ఒక రోజు దేశ వ్యాప్తంగా 13 లక్షల మంది కి పైగా కరోనా వ్యాక్సినేషన్ చేయించుకోగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పంపిణీ అయిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 190 కోట్లకు పైగా ఉంది.

కోవిడ్-19 కారణంగా చోటు చేసుకున్న అధిక మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక గత ఏడాదిలో భారత్‌లో అధికారికంగా మరణించిన వారి సంఖ్య తక్కువగా ఉందని సూచిస్తుంది. WHO నివేదిక 2020 మరియు 2021కి భారతదేశం యొక్క అధిక మరణాలను 47.4 లక్షలు గా పేర్కొంది. అనేక ఇతర అధ్యయనాలు భారతదేశంలో కోవిడ్-సంబంధిత మరణాల సంఖ్య 25 లక్షల నుండి 60 లక్షల మధ్య ఉన్నట్లు చూపించాయి.
అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడి)కి చెందిన 24 మంది విద్యార్థులు గత మూడు రోజుల్లో కోవిడ్ -19 కోసం పాజిటివ్ పరీక్షించారు, వారిలో 16 మందికి ఆదివారం పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (AMC) అదనపు మెడికల్ ఆఫీసర్ హెల్త్ భవిన్ జోషి మాట్లాడుతూ, ముందుజాగ్రత్తగా, తదుపరి సూచనల వరకు ఇన్స్టిట్యూట్లో (పబ్లిక్) సమావేశాలు మరియు విద్యా కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. ఇన్స్టిట్యూట్లో పరీక్ష ప్రక్రియ కొనసాగుతోందని జోషి చెప్పారు.