వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో కరోనా కల్లోలం: రోజువారీ కేసుల రికార్డ్ బ్రేక్ 2,17,353 కొత్త కేసులు, 1,185 మరణాలు

|
Google Oneindia TeluguNews

ఊహించని విధంగా పెరుగుతున్న కేసులతో భారత దేశంలో కరోనా దారుణ పరిస్థితులకు కారణం అవుతుంది. భారతదేశం గత 24 గంటల్లో 2,17,353 కరోనావైరస్ కొత్త కేసులను నమోదు చేసింది. భయంకరంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ లో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1.42 కోట్లకు పైగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం క్రియాశీల కేసులు 10.46 శాతం ఉన్నాయి.

భారతదేశంలో యాక్టివ్ కేసులు 15,697,43 , బాగా తగ్గిన రికవరీలు

భారతదేశంలో యాక్టివ్ కేసులు 15,697,43 , బాగా తగ్గిన రికవరీలు

శుక్రవారం భారతదేశంలో యాక్టివ్ కేసులు 15,697,43 కాగా, మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1,25,47,866 వద్ద ఉన్నాయి. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 88.31 శాతానికి పడిపోయిందని ఏజెన్సీ తెలిపింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 1,185 మంది మరణించారు. దీంతో భారత దేశ మొత్తం మరణాల సంఖ్య 1,74,308 కు చేరుకుంది. దేశం రెండు లక్షలకు పైగా కేసులు వరుసగా రెండో రోజు నమోదు చేసింది, ఆరో రోజు వరుసగా 1.5 లక్షలకు పైగా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది.

మహారాష్ట్రలో కరోనా దారుణ స్థితి .. 61,695 తాజా కరోనావైరస్ కేసులు

మహారాష్ట్రలో కరోనా దారుణ స్థితి .. 61,695 తాజా కరోనావైరస్ కేసులు

దేశంలో అత్యధికంగా నష్టపోయిన రాష్ట్రమైన మహారాష్ట్రలో 61,695 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 36,39,855 గా ఉంది . తాజాగా గత 24 గంటల్లో 349 కొత్త మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 59,153 కు చేరుకున్నాయి. ఏప్రిల్ చివరి వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ విధించి పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కేసుల విషయానికి వస్తే, మహారాష్ట్ర తరువాత దక్షిణ రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.

ఢిల్లీలో నేటి నుండి వారాంతపు కర్ఫ్యూ అమలు , రాజస్థాన్ లోనూ అదే పరిస్థితి

ఢిల్లీలో నేటి నుండి వారాంతపు కర్ఫ్యూ అమలు , రాజస్థాన్ లోనూ అదే పరిస్థితి

ఢిల్లీలోనూ కరోనా దారుణ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూ విధించింది మరియు బుధవారం 17,000 కోవిడ్ కేసులను నమోదు చేసిన తరువాత షాపింగ్ మాల్స్, జిమ్‌లు మరియు స్పాలను ఈ సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు మూసివేయాలని ఆదేశించింది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో 16,699 తాజా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నందున రాజస్థాన్ కూడా ఈ రోజు సాయంత్రం 6 నుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు రాష్ట్రంలో వారాంతపు కర్ఫ్యూ ప్రకటించింది. రాష్ట్రంలో 33 కోవిడ్ మరణాలు మరియు 6,658 కొత్త వ్యాధులు నమోదయ్యాయి.

కుంభమేళాలో 30 మంది సాధువులకు కరోనా పాజిటివ్

కుంభమేళాలో 30 మంది సాధువులకు కరోనా పాజిటివ్

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని మెగా కుంభమేళా కార్యక్రమంలో పాల్గొన్న 30 మంది సాధువులు కోవిడ్ -19 బారిన పడ్డారు. లక్షలాది మంది ప్రజలు గుమిగూడి గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తూ సమయంలో కరోనా కేసులు పెరుగుతాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది . ఈ వారం, భారతదేశం బ్రెజిల్‌ను అధిగమించి, యునైటెడ్ స్టేట్స్ తరువాత ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధిక కేసులతో భారత దేశం రెండో స్థానంలో నిలిచింది

English summary
India logged in a record 2,17,353 daily coronavirus cases as many states grappled with shortages of hospital beds, oxygen, medicines and vaccine doses. The fresh cases in the deadly second wave took the total caseload to over 1.42 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X