• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

corona cases india : ఒక్కరోజే 1.84 లక్షలకు పైగా కేసులు, 1,027 మరణాలతో కరోనా కల్లోలం, ప్రమాదంలో దేశం !!

|

భారత దేశంలో కరోనా దారుణ పరిస్థితులను కలిగిస్తోంది. మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాలలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 1,84,372 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి 1 ,027 మందిని మహమ్మారి బలితీసుకుంది. గత ఐదు నెలల్లో మరణాలు 1000 మార్కును దాటడం ఇదే మొదటిసారి.

 10, 1,000 మార్కును దాటిన కరోనా యాక్టివ్ కేసులు

10, 1,000 మార్కును దాటిన కరోనా యాక్టివ్ కేసులు

దేశంలో మొత్తం ధృవీకరించబడిన కేసులలో 9.24% ఉన్న క్రియాశీల కోవిడ్ -19 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 10, 1,000 మార్కును దాటింది . భారతదేశంలో 1.38 కోట్లకు పైగా కోవిడ్ కేసులతో ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉంది , యునైటెడ్ స్టేట్స్ తర్వాత , బ్రెజిల్ కంటే ముందుకు భారత్ లో కరోనా విలయం చేరుకుంది .భారతదేశం కరోనా సెకండ్ వేవ్ లో దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. భారత దేశంలో తాజా మరణాలతో కలిపి మొత్తం మరణాల సంఖ్య 1,72,085 కు చేరుకుంది .

ఈ సమయంలో కరోనా ఇద్దరి నుండి ముగ్గురికి వ్యాపించే అవకాశం

ఈ సమయంలో కరోనా ఇద్దరి నుండి ముగ్గురికి వ్యాపించే అవకాశం

సమర్థవంతమైన పునరుత్పత్తి సంఖ్య లేదా R (t) అని పిలువబడే ఎపిడెమియోలాజికల్ పరామితి ఆధారంగా వేసిన అంచనా ప్రకారం, దేశంలోఈ సమయంలో ప్రతి ఇద్దరు వ్యక్తులకు సోకిన కరోనా వైరస్, సగటున, మరో ముగ్గురు వ్యక్తులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

మహారాష్ట్ర కరోనా కారణంగా అత్యంత దారుణంగా దెబ్బతింది. రోజువారీ కేసులు అత్యధిక సంఖ్యలో కొనసాగుతుండటంతో, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం మంగళవారం వైరల్ వ్యాప్తిని అరికట్టడానికి తాజా ఆంక్షలను ప్రకటించింది.

మహారాష్ట్రలో సెక్షన్ 144 , నేడు పీఎం మోడీ గవర్నర్లు , ఉప రాష్ట్రపతితో సమావేశం

మహారాష్ట్రలో సెక్షన్ 144 , నేడు పీఎం మోడీ గవర్నర్లు , ఉప రాష్ట్రపతితో సమావేశం

బుధవారం నుండి, మహారాష్ట్రలో సెక్షన్ 144 కింద నిషేధ ఉత్తర్వులు విధించబడ్డాయి . మహారాష్ట్ర మంగళవారం ఒకే రోజులో 60,000 కేసులను నమోదు చేసింది.

దేశంలో కోవిడ్ -19 పరిస్థితిని అంచనా వేయడానికి ఏప్రిల్‌లో కేంద్రం పలు సమావేశాలకు హాజరైనందున, బుధవారం కూడా, ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్‌లతో చర్చలు జరపనున్నారు.

కరోనా రోజువారీ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాలివే

కరోనా రోజువారీ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాలివే

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యాసంస్థలు మూసివేయడంతో పాటుగా, సభలు, సమావేశాలకు అనుమతులు నిరాకరించడం, రాత్రి కర్ఫ్యూ లను విధించడం వంటి చర్యలకు దిగుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, చత్తీస్గడ్, ఢిల్లీ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు గత 24 గంటల్లో అత్యధికంగా కోవిడ్ కేసులను చూసిన ఐదు రాష్ట్రాలు.
1.5 లక్షలకు పైగా కొత్త కేసులను చూడటం దేశంలో ఇది వరుసగా నాలుగవ రోజు అంతేకాదు లక్షకు పైగా కేసులను నమోదు చెయ్యటం వరుసగా ఎనిమిదవ రోజు.

శాస్త్రవేత్తల అంచనా నిజమైంది .. పీక్స్ కు చేరుకున్న కరోనా కల్లోలం

శాస్త్రవేత్తల అంచనా నిజమైంది .. పీక్స్ కు చేరుకున్న కరోనా కల్లోలం

శాస్త్రవేత్తలు ఏప్రిల్ రెండో వారానికి ఇండియా కరోనా కేసుల్లో పీక్స్ కు వెళ్తుందని అంచనా వేసినట్టుగానే కరోనా కేసుల కల్లోలం కొనసాగుతుంది . కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆస్పత్రులలో వైద్య సదుపాయాల కొరత , ఆక్సిజన్ కొరత స్పష్టంగా కనిపిస్తుంది . ఇదే సమయంలో మరణాలు కూడా విపరీతంగా పెరిగాయి. తాత్కాలిక స్మశాన వాటికలు సిద్ధం చేస్తున్న పరిస్థితి పలు రాష్ట్రాల్లో కనిపిస్తుంది . కేంద్రం రాష్ట్రాలను అలెర్ట్ చేస్తూ , నిర్ణయాధికారం రాష్ట్రాలకు వదిలేసింది . తాజా పరిస్థితులతో కరోనా కట్టడి సాధ్యమవుతుందా అన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి .

English summary
India, gripped by the deadly second wave of the pandemic, reported 1,84,372 new coronavirus infections, hitting the highest daily tally once again. The new cases pushed the total cases to over 1.38 crore. Deaths rose by 1,027 to 1,72,085.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X