వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు: గడచిన 24 గంటల్లో 8392 కొత్త కేసులతో రికార్డు

|
Google Oneindia TeluguNews

కరోనా ఇండియాలో తన ప్రతాపం చూపిస్తుంది . కరోనా మహమ్మారి భారత్‌లో పంజా విసురుతుంది రోజురోజుకు పెరుగుతున్న కేసులతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ తాజాగా లాక్ డౌన్ 5.0 ప్రకటించింది కేంద్ర సర్కార్ . ప్రభుత్వం ఓ వైపు లాక్‌డౌన్‌ నిబంధనలను మరింతగా సడలిస్తూ పోతుండగా, మరోవైపు అంతే వేగంగా కేసులు పెరుగుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 8392 పాజిటివ్‌ కేసులు

గడిచిన 24 గంటల్లో కొత్తగా 8392 పాజిటివ్‌ కేసులు

ఇక తాజాగా భారతదేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉంది . ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్‌ 7వ స్థానానికి చేరింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8392 పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఈ వైరస్‌ ప్రభావంతో నిన్న ఒక్క రోజే 230 మంది మృతిచెందారు. మొత్తంగా దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,91,105కి పెరిగింది. ఇందులో 93,774 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 91,907 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దేశంలో ఇప్పటివరకు ఈ ప్రాణాంతక కరోనా మహమ్మారి వైరస్‌ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 5,413కు చేరింది.

అత్యధికంగా మహారాష్ట్రలోనే .. రోజుకు 2 వేలకు పైగా కేసులు

అత్యధికంగా మహారాష్ట్రలోనే .. రోజుకు 2 వేలకు పైగా కేసులు

భారతదేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నేటి నుండి రాష్ట్రంలో సవరించిన లాక్డౌన్ మార్గదర్శకాలను "దశలవారీగా" ప్రకటించిన విషయం తెలిసిందే . మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కరోనా కేసులు 2 వేలకు పైగా నమోదు అయినటు తెలుస్తుంది . ఇక మొత్తం కేసులను చూస్తే 67,655 గా నమోదైంది . మహారాష్ట్రలో ఇప్పుడు ఒక వారానికి పైగా సగటున 2,000 రోజువారీ కొత్త కేసుల నమోదు ఆందోళన కలిగిస్తుంది.

తమిళనాడు, ఢిల్లీలు రెండు, మూడు స్థానాల్లో

తమిళనాడు, ఢిల్లీలు రెండు, మూడు స్థానాల్లో

ఇక తమిళనాడులో కూడా కరోనా కేసులు అత్యదికంగానమోడు అవుతున్నాయి.తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 22,333 గాఉంది . ఇక యాక్టివ్ గా ఉన్న కేసులు 9,400 కాగా ఇక ఇప్పటికే కరోనా నుండి బయటపడి ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12,757 గా ఉంది. అంతేకాదు 176 మంది ఇప్పటివరకు మృతి చెందారు . ఢిల్లీలో కరోనా కేసులను చూస్తే 19,844 కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసులు 10,893 నమోదు అయ్యాయి. ఇక కరోనా బారి నుండి బయటపడిన వారి సంఖ్య 8,478 గాఉంది . ఇక మృతుల సంఖ్య 473గా ఉంది.

English summary
The latest number of corona cases in India is close to two lakh. India ranks 7th in the world with the highest number of coronal cases worldwide. A total of 8392 positive cases were reported in the last 24 hours across the country, with 230 deaths due to the virus. Overall, the number of corona positive cases in the country so far has increased to 1,91,105.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X