వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో 30 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. గత 24 గంటల్లో 69,878 కొత్త కేసులు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా బీభత్సం కొనసాగుతూనే ఉంది .తాజాగా 30 లక్షలకు కేసులు చేరుకున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్న తీరు ఇబ్బంది కలిగిస్తుంది. ఆగస్టులో గతంతో పోలిస్తే ఎక్కువ కేసులు నమోదయ్యాయని తాజా కేసులను బట్టి అర్ధం అవుతుంది .

డిసెంబర్ 3 నాటికి కరోనా అంతమవుతుందా? ఇండియా ఔట్ బ్రేక్ నివేదిక నిజమవుతుందా!!డిసెంబర్ 3 నాటికి కరోనా అంతమవుతుందా? ఇండియా ఔట్ బ్రేక్ నివేదిక నిజమవుతుందా!!

 ఇండియాలో గత 24 గంటల్లో 69,878 కొత్త కేసులు, 945 మరణాలు

ఇండియాలో గత 24 గంటల్లో 69,878 కొత్త కేసులు, 945 మరణాలు

గత 24 గంటల్లో భారత్ లో 69,878 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే గత 24 గంటల్లో ఇండియా 945 మరణాలను నివేదించింది . దీంతో దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 29,75,702 కు పెరిగింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 55,794 కు చేరుకుంది. ప్రస్తుతం, భారతదేశంలో 6,97,330 యాక్టివ్ కేసులు ఉండగా, 22,22,578 మందికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. రికవరీ రేటు గత 74.69 శాతానికి పెరిగింది. కేసుల మరణాల రేటు కూడా 1.87 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

అమెరికా, బ్రెజిల్ కంటే ఎక్కువగా కరోనా కొత్త కేసులను నమోదు చేస్తున్న ఇండియా

అమెరికా, బ్రెజిల్ కంటే ఎక్కువగా కరోనా కొత్త కేసులను నమోదు చేస్తున్న ఇండియా

అలాగే, ఇండియాలో ఆగస్టు 21 వరకు మొత్తం 3,44,91,073 నమూనాలను పరీక్షించారు, శుక్రవారం 10,23,836 నమూనాలను పరీక్షించారు, ఇది ఇప్పటివరకు ఒక రోజులో అత్యధికంగా జరిపిన పరీక్షల్లో రికార్డ్ గా చెప్పవచ్చు .రోజువారీ కేసుల వృద్ధి రేటు మందగించడం కొనసాగించడంతో, భారతదేశంలో కరోనావైరస్ కేసుల రెట్టింపు సమయం ఇప్పుడు 30 రోజులకు పడిపోయింది. అయితే టాప్ త్రీ లో ఉన్న మూడు దేశాలతో పోల్చి చూస్తే ఇండియాలోనే గత 16 రోజులుగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్ కంటే ఎక్కువగా కరోనా కొత్త కేసులను ఇండియా నమోదు చేస్తుంది .

Recommended Video

COVID-19 Cases Cross 1 Lakh Mark In Telangana తెలంగాణ గ్రేటర్ పరిధిలో మళ్లీ పెరుగుతున్న కేసులు!!
ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల 30 లక్షల కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల 30 లక్షల కేసులు


ప్రపంచవ్యాప్తంగా, 2,29,49,234 మందికి కరోనా వైరస్ సోకింది, వీరిలో 7.9 లక్షలకు పైగా మరణించారు. యునైటెడ్ స్టేట్స్ కరోనా ప్రభావంతో తీవ్ర నష్టాన్ని చవి చూస్తుంది .ఇక ఆ తరువాత స్థానాల్లో బ్రెజిల్ మరియు భారతదేశం ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో ఈ వైరస్ మొట్టమొదటిసారిగా పుట్టిందని ప్రకటించిన చైనా, ఇక తాజాగా కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిందని ,బీజింగ్‌లో నివసించే ప్రజలు ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. కరోనావైరస్ మహమ్మారిని ప్రపంచం రెండేళ్లలోపు అంతం చేయగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది .

English summary
With India reporting 69,878 cases and 945 deaths in the last 24 hours, the total number of coronavirus infections in the country rose to 29,75,702 and the death toll reached 55,794 on Saturday. Currently, India has 6,97,330 active cases while 22,22,578 people have been treated and discharged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X