వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో రెండు రోజుల కంప్లీట్ లాక్ డౌన్ ..ఈ వీకెండ్ కూడా.. కేసుల ఉధృతితో సర్కార్ ప్రకటన !!

|
Google Oneindia TeluguNews

కేరళ రాష్ట్రంలోకరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో కేరళ రాష్ట్రం విలవిలలాడుతోంది. తాజాగా దేశ వ్యాప్తంగా భారీగా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలలో కేరళ రాష్ట్రం ఉంది. దీంతో కేరళ ప్రభుత్వం కరోనా కట్టడికి సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి పై పోరాటం సాగించడానికి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోమారు వీకెండ్ సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు.

Recommended Video

Kerala Oxygen Supply : ఆక్సిజన్ సప్లై చేసే స్థాయిలో కేరళ ఎలా ఉంది? || Oneindia Telugu

ఇండియాలో కొనసాగుతున్న కరోనా .. గత 24 గంటల్లో 43,509 కొత్త కేసులు, 640 మరణాలుఇండియాలో కొనసాగుతున్న కరోనా .. గత 24 గంటల్లో 43,509 కొత్త కేసులు, 640 మరణాలు

శని ఆదివారాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటిస్తూ కేరళ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కేరళ రాష్ట్రంలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం రోజు కేరళ రాష్ట్రం 22,056 కరోనా కేసులు నమోదు చేసింది. విపరీతంగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం జూలై 31, ఆగస్టు 1వ తేదీన కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించింది. కేరళలో రోజువారీ కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ శని ఆదివారాలలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తూ ఒక ప్రకటన చేశారు.

 Corona cases rise in Kerala ; Complete lock down for two days on weekend

తాజా 24 గంటల వ్యవధిలో 1,96,902 నమూనాలను పరీక్ష కోసం పంపిన తరువాత 22,056 మంది పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో 1.49 లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి, బుధవారం 17,761 మంది కోలుకున్న తరువాత, రాష్ట్రంలో మొత్తం సంఖ్య కరోనా కేసుల సంఖ్య 31.60 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లో 131 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా మరణాల సంఖ్య 16,457 గా ఉంది. తాజాగా మలప్పురం జిల్లా 3,931 కొత్త కేసులతో మొదటి స్థానంలో ఉంది. త్రిస్సూర్ 3,005 కేసులను నమోదు చేసింది.

English summary
Kerala on Wednesday recorded 22,056 fresh COVID-19 cases pushing the infection caseload to 33,27,301. Complete lockdown will be imposed in Kerala on 31st July and 1st August due to rising COVID-19 cases in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X