వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో వణికిస్తున్న చలితో పాటు కరోనా పంజా .. థర్డ్ వేవ్.. ఒకేరోజు రికార్డ్ స్థాయిలో కేసులు

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఢిల్లీ వాసులకు టెన్షన్ పెడుతున్నాయి . కరోనా కేసుల వ్యాప్తి ఈ చలికాలంలో తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే . దీంతో పాటు ఢిల్లీ లో థర్డ్ వేవ్ గా మొదలైందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొనటం కూడా తాజా పరిస్థితికి అద్దం పడుతుంది . గత 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో 7,745 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు . ఆదివారం కరోనావైరస్ కేసులు ఢిల్లీలో రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో ఆందోళన వ్యక్తం అవుతుంది .

Recommended Video

Coronavirus 2nd Wave : సెకండ్ వేవ్ మొదలైంది.. అయినా ప్రజల్లో నిర్లక్ష్యం || Oneindia Telugu
ఢిల్లీలో కరోనా పంజా ...4,50 వేలకు చేరువగా కేసులు

ఢిల్లీలో కరోనా పంజా ...4,50 వేలకు చేరువగా కేసులు

వాయు కాలుష్యం పెరగడం వల్ల కోవిడ్ -19 కేసులు పెరిగాయని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వం దీపావళి టపాసుల అమ్మకం మరియు వాడకాన్ని నిషేధించిన తరువాత కూడా కేసుల పెరుగుదల గణనీయంగా కనిపిస్తుంది .
ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ నవంబర్ 8 న 6,069 రికవరీలు మరియు 77 కోవిడ్ మరణాలను నివేదించింది. ఆదివారం గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే, దేశ రాజధానిలో నిన్నటి వరకు నమోదైన కరోనావైరస్ కేసుల సంఖ్య 4,38,529 గా ఉంది. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ అయిన వారు 3,89,683 మంది కాగా , 6,989 మంది కరోనా కారణంగా మరణించారు.

ఢిల్లీ లో కరోనా థర్డ్ వేవ్ .. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ప్రకటన

ఢిల్లీ లో కరోనా థర్డ్ వేవ్ .. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ప్రకటన

నవంబర్ 8 నాటికి ఢిల్లీలో కోవిడ్ -19 క్రియాశీలక కేసులు 41,857 ఉన్నాయని తాజా నివేదికల ఆధారంగా తెలుస్తుంది. దేశ రాజధానిలో కరోనావైరస్ రోగుల రికవరీ రేటు 88.86 శాతం, పాజిటివిటీ రేటు 15.26 శాతం, మరణ రేటు 1.59 శాతంగా ఉంది . అంతేకాదు క్రియాశీల కేసుల నిష్పత్తి 9.54 శాతంగా ఉంది . ఢిల్లీలో గత 24 గంటల్లో 50,754 నమూనాలను పరీక్షించారు. దేశ రాజధానిలో ఇప్పటివరకు మొత్తం 50,99,774 పరీక్షలు నిర్వహించారు .ఢిల్లీ లో కరోనావైరస్ థర్డ్ వేవ్ చూస్తున్నట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు .ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు .

చలికాలంలో విపరీతంగా పెరుగుతున్న కేసులు

చలికాలంలో విపరీతంగా పెరుగుతున్న కేసులు

చలికాలంలో కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఆసుపత్రులలో కోవిడ్ -19 రోగులకు పడకల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది . కాని హోటళ్ళు మరియు బాంకెట్ హాళ్ళలో కరోనాని నియంత్రించే ప్రణాళిక మాత్రం కనిపించటం లేదు . దీంతో కోవిడ్ -19 యొక్క థర్డ్ వేవ్ ఢిల్లీలో ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంది. కేసుల సంఖ్య పెరుగుదల ఢిల్లీలో కరోనా తీవ్రతను సూచిస్తుంది . అయితే కేసులు త్వరలో తగ్గుతాయని జైన్ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .

English summary
Delhi on Sunday reported a record spike in coronavirus cases with 7,745 more individuals testing positive for the infection in the national capital in the last 24 hours.The Delhi government's health department also reported another 6,069 recoveries and 77 more Covid-related deaths on November 8. With Sunday's figures taken into account, the national capital's tally of confirmed coronavirus cases now stands at 4,38,529. This includes 3,89,683 patients who have been discharged after recovering from the virus and 6,989 who succumbed to it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X