వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Corona:‘లిమిటెడ్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌’పై కేంద్రం స్పష్టత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై కేంద్రం స్పందించింది. కరోనావైరస్ ప్రభావం స్థానిక వ్యాప్తి(లోకల్ స్టేజ్)లోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్టేజ్‌(సమూహ వ్యాప్తి)కి చేరుకోలేదని కేంద్ర ఆరోగ్యశఆఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్టేజ్‌కి చేరితే కేంద్ర ఆరోగ్యశాఖ ఆ విషయాన్ని వెల్లడిస్తుందని చెప్పారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం విడుదల చరేసిన ఓ డాక్యుమెంట్ ఈ ప్రశ్న తలెత్తడానికి కారణమవడం గమనార్హం. అందులో పరిమిత స్థాయిలో సమూహ వ్యాప్తి అని పేర్కొనడంతో మీడియా ప్రతినిధులు దానిపై ప్రశ్నించారు.

Coronavirus: Govt plays down limited community transmission wording in official release.

ఈ క్రమంలోనే లవ్ అగర్వాల్ మన దేశం ఇంకా స్థానిక వ్యాప్తి దశలోనే ఉందని స్పష్టం చేశారు. మనదేశంలో జనసాంద్రత ఎక్కువని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని అనుసరిస్తేనే కరోనాను అరికట్టగలమని లవ్ అగర్వాల్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయని, ప్రభుత్వాల మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

వ్యాధి పట్ల ఏ మాత్రం అనుమానం ఉన్నా కాల్ సెంటర్లను సంప్రదించాలని తెలిపారు. కాగా, ప్రస్తుతం దేశంలో 1200కుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా 35వేల మంది మృతి చెందారు. 7లక్షల మందికిపైగా కరోనాబారిన పడి చికిత్స పొందుతున్నారు.

English summary
Coronavirus: Govt plays down limited community transmission wording in official release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X