వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్ .. పబ్స్ ,బార్స్ ,కేఫ్ లతో సహా 5 లక్షల రెస్టారెంట్లు బంద్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో తన ప్రతాపం చూపుతుంది . కరోనా వైరస్ ను నియంత్రించే క్రమంలో భాగంగా అనేక రాష్ట్రాలలో పాఠశాలలు, సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్‌ను ఇప్పటికే మూసివేశారు . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుంపులు గుంపులుగా తిరగొద్దని సూచిస్తున్నారు. ఇక తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 147కు చేరింది.

కరోనాఎఫెక్ట్: తాజ్ మహల్ , షిరిడి , ఉజ్జయిని మహంకాళి ఆలయం మార్చి 31 వరకు మూసివేత కరోనాఎఫెక్ట్: తాజ్ మహల్ , షిరిడి , ఉజ్జయిని మహంకాళి ఆలయం మార్చి 31 వరకు మూసివేత

 కరోనాతో చాలా రాష్ట్రాల్లో షట్ డౌన్

కరోనాతో చాలా రాష్ట్రాల్లో షట్ డౌన్

కరోనా వ్యాప్తిని అరికట్టకుంటే చాలా ప్రమాదం, ఆ తర్వాత కంట్రోల్ చెయ్యటం కష్టం అని భావిస్తున్న నేపధ్యంలో దీనితో దాదాపు సగం రాష్ట్రాలు బంద్ పాటిస్తున్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాలు కూడా అదే బాటలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టటానికి
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తమ అధీనంలో ఉన్న 5 లక్షల రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ వెల్లడించింది.

5 లక్షల రెస్టారెంట్లను మూసివేయాలని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం

5 లక్షల రెస్టారెంట్లను మూసివేయాలని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం

ఇక ఒక్క రెస్టారెంట్లు మాత్రమే కాకుండా ప్రజలు ఎక్కువగా వెళ్తుండే పబ్‌లు, బార్లు, కేఫ్‌లను కూడా ఇవాళ్టి నుంచి మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది .ఈ మేరకు ప్రకటనను విడుదల చేసిన నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్లు ఖచ్చితంగా మూసివేయాలన్న నియమం ఏమి లేదని, యాజమాన్యాల ఇష్టమని అసోసియేషన్ స్పష్టం చేసింది. అయితే ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని సామాజిక హితంకోసం మూసివేస్తే మంచిదని సూచించింది.

Recommended Video

కరోనా Thermal Scanning Center At TDP Central Office | Oneindia Telugu
సానుకూలంగా స్పందించిన రెస్టారెంట్ల యాజమాన్యం

సానుకూలంగా స్పందించిన రెస్టారెంట్ల యాజమాన్యం

ఇక ఈ ప్రకటనకు దాదాపు చాలా రెస్టారెంట్లు సానుకూలంగా స్పందించాయి .మరోవైపు ఎన్‌ఆర్ఏఐ ఆదేశాలను పాటిస్తామని ఈ నెల 31 వరకు తమ ఔట్‌లెట్లను మూసివేస్తామని ఫస్ట్ ఫిడ్డిల్ రెస్టారెంట్ల ఎండీ ప్రియాంక పేర్కొన్నారు . అయితే డొమినోస్ మాత్రం తమ రెస్టారెంట్లను మూసివేయమని, తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, ఇక యధావిధిగా తమ బిజినెస్ కొనసాగిస్తామని ప్రకటించింది. ఇక ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లో హై అలెర్ట్ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనావ్యాప్తిని నివారించటానికి నానా తిప్పలు పడుతున్నాయి.

English summary
Almost half of the states have been shut down about in the wake of the treat of corona outbreak, which is a high risk and difficult to control. The rest of the state is on the same path. In this backdrop, the National Restaurant Association of India has taken a key decision. To curb the spread of coronaThe association said it had decided to close 5 lakh restaurants under its control to prevent the spread of the corona epidemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X