• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్ .. ఈ సమయంలో మరణిస్తే ఆ నలుగురూ కూడా రాని పరిస్థితి

|

కరోనా ఇప్పుడు భయపెడుతుంది. పలు సందర్భాల్లో మానవత్వం ఉన్న మనుషులను బాధ పెడుతుంది . కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించటం, ప్రజలను బయటకు రాకుండా కట్టడి చెయ్యటం జరుగుతుంది. ఇక ఈ సమయంలో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబాల కష్టాలు అన్నీ ఇన్నీ కావు . బంధువులు రారు. అంత్యక్రియలకు వెళ్లేందుకు పట్టుమని పది మంది సాయంగా రారు . ఆ నలుగురూ కరువవుతారు . ఇక ఇలాంటి పరిస్థితులు ప్రజలను చాలా వేదనకు గురి చేస్తున్నాయి.

తిరుమలలో శ్రీవారి అఖండ దీపం కొండెక్కిందని ప్రచారం ... టీటీడీ క్లారిటీ

 కరోనా సమయంలో మరణిస్తే అనాధ శవాలే

కరోనా సమయంలో మరణిస్తే అనాధ శవాలే

కరోనా భయం ప్రతి ఒక్కరిలో ఉంది. మానవత్వం ఉన్నా , పక్కింటి వాళ్లకు కష్టం వచ్చిందంటే కూడా ఈ సమయంలో కాదు అని చెప్పే పరిస్థితి . ఇప్పటికే చాలా చోట్ల చాలా మంది న్యాచురల్ డెత్స్ సంభవించినా అయిన వాళ్ళు రాలేని పరిస్థితి . ఇక తాజాగా జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం మన సమాజంలో పరిస్థితికి అద్దం పడుతుంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో కొసరి రాజవ్వ ఆరోగ్య సమస్యలతో మృతి చెందారు.రాజవ్వ భర్త అంజయ్య 2 నెలల క్రితం చనిపోయారు. ఆమెకు పిల్లలు లేరు కానీ బంధుగణం ఉంది .

అంతిమ యాత్రలు లేవు .. క్రతువులు కష్టమే

అంతిమ యాత్రలు లేవు .. క్రతువులు కష్టమే

అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం , అదే విధంగా లాక్ డౌన్ లో ప్రజలు ఉండటంతో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాని రాజవ్వ శవం అనాధ శవంగా మారింది. ఇక వూరి సర్పంచ్ చొరవ తీసుకుని రాజవ్వ అంత్యక్రియలు నిర్వహించేలా చేశారు . పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది రాజవ్వ శవాన్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి చెత్తను తరలించే రిక్షాలో అంతిమయాత్రకు తరలించి దహన సంస్కారాలు జరిగేలా చెయ్యటం గ్రామస్తులను బాధకు గురి చేసింది . కానీ తప్పని పరిస్థితి . ఇక ఇలాంటి ఘటనలు ఈ సమయంలో మరణిస్తే ఎలా ఉంటుందో చెప్పకనే చెప్తున్నాయి.

 అందరూ ఉన్నా అనాధ శవాలుగా మారుస్తున్న కరోనా .. కంట తడిపెడుతున్న ప్రజలు

అందరూ ఉన్నా అనాధ శవాలుగా మారుస్తున్న కరోనా .. కంట తడిపెడుతున్న ప్రజలు

ఇప్పటికే చాలా చోట్ల తల్లి, దండ్రులు చనిపోతే పిల్లలు రాలేని పరిస్థితి. విదేశాల్లో ఉన్న వారి పరిస్థితి అయితే ఇంకా ఘోరం . ఇప్పుడు మరణిస్తే స్మశానానికి చేర్చే వాళ్ళు కూడా కరవవుతున్న పరిస్థితి. ఇంకా మరణాంతర క్రతువుల గురించి ఇంకా చెప్పనక్కరలేదు. శాస్త్రోక్తంగా ఏది నిర్వహించటానికి ఈ సమయం అనుకూలంగా లేదు. కాబట్టి ఈ సమయంలో సాధారణ మరణాలు సైతం ఇబ్బందికరం అనే భావన వ్యక్తం అవుతుంది. అందరూ ఉన్నా అనాధ శవాలుగా స్మశానాలకు చేరుతున్న పరిస్థితి ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తుంది.

English summary
Corona is frightening the world now. so many situations afflicts human beings. At a time when the corona effect is severe, governments are announcing lockdowns and blocking people from coming out. If someone dies at this time, the family's woes are not all that. Relatives wont come. Such conditions are causing people much pain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X