వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ప్రభావం ...జైలుకు నిప్పు పెట్టిన ఖైదీలు

|
Google Oneindia TeluguNews

కరోనా ఇప్పుడు భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది. భారత్ దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.కరోనా వైరస్ ను కంట్రోల్ చెయ్యటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ప్రజల్లో ముఖ్యంగా అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఒక్కో సారి ఇబ్బంది కలిగిస్తున్నాయి.ఏకంగా ఒక సెంట్రల్ జైల్లో ఖైదీల ఆగ్రాహానికి కారణం అయ్యాయి. దీంతో జైలుకు నిప్పుపెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు .

జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్ ... వైన్స్ బంద్ .. సండే మందుబాబులకు షాక్జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్ ... వైన్స్ బంద్ .. సండే మందుబాబులకు షాక్

కోల్‌కత్తా డమ్‌ డమ్‌ సెంట్రల్‌ జైల్లో ఘర్షణ

కోల్‌కత్తా డమ్‌ డమ్‌ సెంట్రల్‌ జైల్లో ఘర్షణ

కరోనా వైరస్‌ కోల్‌కత్తా డమ్‌ డమ్‌ సెంట్రల్‌ జైల్లో ఘర్షణకు కారణమైంది. కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపధ్యంలో కరోనా నియంత్రణ కోసం ఖైదీలకు వారి కుటుంబ సభ్యులతో ములాఖత్ ను నిలిపివేశారు . ఖైదీల ములాఖత్‌ను తాత్కాలికంగా నిలిపివేయటంతో ఖైదీలలో అసహనం నెలకొంది. ఈ నెల 31 వరకూ ములాఖత్‌ లు ఉండబోవని జైలు అధికారులు సదరు ఖైదీలకు, వారి కుటుంబాలకు స్పష్టం చేశారు . దీంతో జైల్లో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు కోపం కంట్రోల్ కాలేదు .

 ములాఖత్‌ నిలిపివెయ్యటంతో జైలుకు నిప్పంటించిన ఖైదీలు

ములాఖత్‌ నిలిపివెయ్యటంతో జైలుకు నిప్పంటించిన ఖైదీలు

తమ వారి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే కలవనివ్వకుండా ఆంక్షలు విధిస్తారా అని మండిపడిన ఖైదీలు జైలు సిబ్బందిపై దాడి చేశారు . రాళ్లు రువ్వారు ఖైదీలు. అక్కడితో ఆగకుండా జైలులో ఓ గదికి నిప్పు పెట్టారు. ఇక పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో జైలు సిబ్బంది జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఖైదీలు చనిపోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన జైలు అధికారులు ఫైరింజన్లను రప్పించి మంటల్ని అదుపు చేశారు.

Recommended Video

PM Modi Telugu Speech On Coronavirus | 'Janata Curfew' Why Only One Day ? | Oneindia Telugu
 సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను పెరోల్ పై 15 రోజులు విడుదల నిర్ణయం కూడా కారణం

సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను పెరోల్ పై 15 రోజులు విడుదల నిర్ణయం కూడా కారణం

కరోనా నేపధ్యంలో జైళ్ళ శాఖ సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను పెరోల్ పై 15 రోజుల పాటు విడుదల చెయ్యనున్నారు . కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించాలన్న ఉద్దేశంలో ములాఖత్‌ను రద్దు చేసి పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపిన వారు, సత్ప్రవర్తన కలిగి ఉన్న ఖైదీలకు 15 రోజుల పెరోల్ ఇవ్వడానికి జైలు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇది ఎవరికైతే జైలు అధికారులు తీసుకున్న నిర్ణయం వర్తించదో ఆ ఖైదీలకు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. ఆగ్రహం తట్టుకోలేకపోయిన ఖైదీలు జైలుకు నిప్పింటించేందుకు ప్రయత్నం చేశారు .

English summary
Coronavirus caused confrontation in Kolkata's Dum Dum central jail . With the coronavirus spreading nationwide, inmates have been able to stop mulaqat with their families for corona control. Prisoners were embarrassed by the suspension of the prisoners' mulakhat. Prison officials attacked by prisoners and set fire to the prison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X