• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనాఎఫెక్ట్: తాజ్ మహల్ , షిరిడి , ఉజ్జయిని మహంకాళి ఆలయం మార్చి 31 వరకు మూసివేత

|

కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు భారత్ ను వణికిస్తుంది. కరోనా వైరస్ ను నియంత్రించే క్రమంలో భాగంగా అనేక రాష్ట్రాలలో పాఠశాలలు, సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్‌ను మూసివేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుంపులు గుంపులుగా తిరగొద్దని సూచిస్తున్నారు. తెలంగాణా, మహారాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే తాజాగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు కూడా సెలవులు ప్రకటించాయి. ఇక షిరిడీ ఆలయం , తాజ్ మహల్ సందర్శన , ఉజ్జయినీ మహంకాళీ ఆలయాలను సైతం ఈ నెల 31 వరకు మూసివెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, ఆలయాలు మూసివేత

మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, ఆలయాలు మూసివేత

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి, మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు మరియు మ్యూజియంలను మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఆగ్రాలో, తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ, మహాతాబ్ బాగ్ సహా స్మారక చిహ్నాలన్ని మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు . అదే సమయంలో, హుమాయున్ సమాధి, కుతుబ్ మినార్, అజంతా ఎల్లోరా గుహలతో సహా 200 కి పైగా చారిత్రక భవనాలను, ప్రధాన స్మారక కట్టడాలను మూసివేయాలని ఆదేశించారు.

ఉజ్జ‌యినిలోని మహంకాళి ఆలయం మూసివేత

ఉజ్జ‌యినిలోని మహంకాళి ఆలయం మూసివేత

కరోనా వైరస్ నేపథ్యంలో ప్ర‌ఖ్యాత ఆల‌యాలు కూడా మూతపడుతున్న పరిస్థితి ఉంది. కరోనా వైరస్ కారణంగా ఉజ్జయిని మహాకాల్ ఆలయంలోకి సాధారణ భక్తుల ప్రవేశాన్ని నిషేధించింది. కరోనా వ్యాప్తి జరగకుండా ఆలయాలను మూసివెయ్యాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ కొన్ని గైడ్స్‌లైన్స్ జారీ చేసింది. భ‌క్తులు భారీ సంఖ్య‌లో రాకుండా ఉండేందుకు సూచ‌న‌లు చేశాయి. ఈ క్రమంలోనే ఉజ్జ‌యినిలోని మహంకాళి ఆలయంపై కూడా వైరస్ ప్రభావం పడింది. మహంకాళి ఆల‌యంలో ఇవాళ భ‌క్తులు లేకుండానే భ‌స్మ హార‌తి నిర్వ‌హించారు.

కరోనా వైరస్ దృష్ట్యా ముంబైలోనూ అదే పరిస్థితి

కరోనా వైరస్ దృష్ట్యా ముంబైలోనూ అదే పరిస్థితి

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో గల పురాతన మహంకాళీ దేవాలయాన్ని మూసివేశారు. మంగళవారం మహంకాళీ దేవాలయంలో పూజారులు భస్మహారతి పూజలు నిర్వహించినా ఉజ్జయిని దేవాలయంలో మార్చి 31 వతేదీ వరకు భక్తులను అనుమతించకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ముప్పు దృష్ట్యా, ముంబైలోని బాబుల్నాథ్ ఆలయం తదుపరి ఆదేశాల వరకు మూసివేయబడింది.

ప్రముఖ ప్రదేశాలకు , పర్యాటక ప్రాంతాలకు కరోనా ఎఫెక్ట్

ప్రముఖ ప్రదేశాలకు , పర్యాటక ప్రాంతాలకు కరోనా ఎఫెక్ట్

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 114కి చేరిన నేపథ్యంలో ముంబై నగరంలోని సిద్ధి వినాయక దేవాలయాన్ని మూసివేశారు. మళ్లీ ప్రకటించేవరకూ సిద్ధివినాయక ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయకమిటీ పేర్కొంది.కరోనా వైరస్ ప్రమాదం దృష్ట్యా, నాగ్‌పూర్‌లో సెక్షన్ 144 ను అమలు చేసింది. కరోనా ముప్పును దృష్టిలో ఉంచుకుని గోవాలోని వన్యప్రాణుల అభయారణ్యాన్ని మూసివేయాలని ఆదేశించారు. హిమాచల్ ప్రదేశ్ పెద్ద సంఖ్యలో మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనకుండా నిషేధాజ్ఞలు విధించారు.

  Coronavirus In India : Paracetamol Sufficient For COVID 19, Trolls On KCR And Jagan
  పంజాబ్ లోనూ ప్రముఖ స్థలాల సందర్శనకు ఆంక్షలు

  పంజాబ్ లోనూ ప్రముఖ స్థలాల సందర్శనకు ఆంక్షలు

  పంజాబ్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్ వ‌ద్ద కూడా ఆంక్ష‌లు విధించారు. అమృత్‌స‌ర్‌లో ఆల‌య సంద‌ర్శ‌న‌కు వ‌స్తున్న భ‌క్తులకు గురుద్వారా ప్ర‌బంద‌క్ క‌మిటీ శానిటైజ‌ర్ల‌ను అంద‌జేసింది.

  కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలోని పలు దేవాలయాల్లో భక్తుల రాకపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని,ఇళ్లలోనే ఉండి శుభ్రత పాటించాలని చెప్తుంది సర్కార్ .

  English summary
  The government has ordered the closure of monuments, archaeological sites and museums throughout the country till March 31 to prevent the spread of coronavirus. taj mahal, ujjayini mahankali temple and shirdi sainath temple also going to shut down till march 31. At the same time, ordered the closure of more than 200 historic buildings and major monuments, including the Humayun's Tomb, Qutub Minar and Ajanta Ellora Caves.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X