వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెలికాం కంపెనీలపై కరోనా ప్రభావం .. నెట్‌వర్క్ ట్రాఫిక్‌ ఒత్తిడిపై కేంద్రానికి లేఖ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాచుతున్న వేళ దేశం మొత్తం షట్ డౌన్ అవుతుంది. దీంతో అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్న పరస్థితి కనిపిస్తుంది. టెక్నాలజీ పెరిగిన నేపధ్యమో చాలా సంస్థలు ఉద్యోగులను ఇళ్ళ నుండే పని చెయ్యాలని , వర్క్ ఫ్రమ్ హోం అంటూ ఆదేశాలిచ్చారు . ఇక విద్యా సంస్థలు సైతం ఆన్ లైన్ క్లాసులు చెప్తామని ప్రకటించిన పరిస్థితి. ఇక దేశ ప్రజలకు సైతం ఇళ్ళలో కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ తో నెట్ ను తెగ వాడేస్తున్నారు. దీంతో టెలికాం కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి.

కేంద్ర టెలికాం శాఖకు తాజా పరిస్థితి లేఖ రాసిన టెలికాం సంస్థలు

కేంద్ర టెలికాం శాఖకు తాజా పరిస్థితి లేఖ రాసిన టెలికాం సంస్థలు

కరోనావైరస్ ప్రభావం ఇప్పుడు టెలీకాం కంపెనీలపైనా పడటంతో వారు కేంద్ర టెలికాం శాఖకు తాజా పరిస్థితి లేఖ రాశారు . కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఉద్యోగులు ఇంటివద్ద నుంచే పనిచేస్తుండడంతో నెట్‌వర్క్ ట్రాఫిక్‌ ఒత్తిడికి గురవుతుందని టెలికాం కంపెనీలు తమ లేఖలో పేర్కొన్నాయి . ప్రధానంగా నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి వీడియో స్ట్రీమింగ్ వేదికల కారణంగా ఈ ఒత్తిడి మరింత పెరిగింది అని భావిస్తున్న నేపధ్యంలో వీడియో క్వాలిటీ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

టెలీకాం ప్రొవైడర్లకు స్ట్రీమింగ్ కంపెనీల సహకారం కావాలని విజ్ఞప్తి

టెలీకాం ప్రొవైడర్లకు స్ట్రీమింగ్ కంపెనీల సహకారం కావాలని విజ్ఞప్తి

ఇక ఇదే విహయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళిన ఓటీటీ కంపెనీలన్నీ తమ వీడియో నాణ్యతను తగ్గించేలా ఆదేశించాలంటూ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర టెలీకాం శాఖకి రాసిన లేఖలో పేర్కొంది. మరోవైపు..ఈ విపత్కర సమయంలో టెలీకాం ప్రొవైడర్లకు స్ట్రీమింగ్ కంపెనీల సహకారం ఎంతైనా అవసరమని భావిస్తున్నామని వారు ఆ లేఖలో చెప్పారు.

ఇండియా షట్ డౌన్ ... టెలికాం సంస్థలకు , నెటిజన్లకు తిప్పలు

ఇండియా షట్ డౌన్ ... టెలికాం సంస్థలకు , నెటిజన్లకు తిప్పలు

అనేక క్లిష్టమైన అవసరాల దృష్ట్యా నెట్‌వర్క్ వ్యవస్థ మీద తీవ్ర ఒత్తిడి పడుతున్నందున ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ పరిస్థితిని నియంత్రించాల్సిన అవసరం ఉంది అని సీవోఏఐ తన లేఖలో పేర్కొంది. మరి ఈ విషయంలో కేంద్ర టెలికాం శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు టెలికాం కంపెనీలకు ఇండియా షట్ డౌన్ సందర్భంగా పెద్ద చిక్కే వచ్చి పడింది. విపరీతంగా ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ వినియోగిస్తున్న తరుణంలో నెట్వర్క్ ఒత్తిడి తీవ్రంగా ఉండనుంది. ఇక నెటిజన్లకు ఇంటర్నెట్ తిప్పలు తప్పేలా లేవు. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారికి కూడా నెట్ వర్క్ చుక్కలు చూపిస్తుంది

English summary
With the coronavirus's impact on telecom companies now, they have written a fresh status letter to the central telecom department. Video pressure is expected to decrease the quality of videos. as pressure increases, mainly due to video streaming, such as Netflix, YouTube, Amazon Prime and Hotstar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X