• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇండియాలో కరోనా .. గత 24 గంటల్లో రికవరీలు 37 వేలు, 41 వేలకు పైగా కొత్త కేసులు !!

|

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజువారి నమోదవుతున్న కేసులు మరణాలలో స్వల్ప హెచ్చుతగ్గులను నమోదు చేస్తుంది. తాజాగా గత 24 గంటల్లో భారతదేశంలో 41,649 కొత్త కరోనావైరస్ కేసులు (కోవిడ్ -19) నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,16,13,993 కు చేరుకుంది. గత 24 గంటల్లో 593 మరణాలు నమోదుకాగా మొత్తం మరియు మరణాల సంఖ్య 4,23,810 కి చేరుకుంది.

టీకాలు తీసుకున్న వారికి సవాల్ గా కరోనా డెల్టా వేరియంట్ .. భారీగా కేసులు, సాక్ష్యాలివే... బీ అలెర్ట్ !!టీకాలు తీసుకున్న వారికి సవాల్ గా కరోనా డెల్టా వేరియంట్ .. భారీగా కేసులు, సాక్ష్యాలివే... బీ అలెర్ట్ !!

 ఇండియాలో యాక్టివ్ కేసులు 4,08,920

ఇండియాలో యాక్టివ్ కేసులు 4,08,920

తాజాగా కోవిడ్ -19 యాక్టివ్ కేసులు 4,08,920 కి పెరిగాయి. కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్న వారి సంఖ్య 3,07,81,263 కు పెరిగింది. అయితే మరణాల రేటు 1.34 శాతంగా ఉంది.ఇటీవల నాలుగు లక్షలు దిగువకు చేరిన కరోనా క్రియాశీల కేసులు మళ్లీ తాజాగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 1.29 శాతం ఉండగా రికవరీలు 97.37 శాతానికి చేరుకుంది. నిన్న ఒక్కరోజు కరోనా మహమ్మారి బారిన పడిన వారు 37 వేల మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 3.07 కోట్లకు చేరుకున్నాయి.

 కేరళకు ప్రత్యేక కేంద్ర బృందం .. కరోనా కట్టడికి కేరళ సర్కార్ యత్నం

కేరళకు ప్రత్యేక కేంద్ర బృందం .. కరోనా కట్టడికి కేరళ సర్కార్ యత్నం

కేరళ లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఆరుగురు సభ్యుల నిపుణుల బృందాన్ని కేరళకు పంపింది. కేరళలో శుక్రవారం 24 గంటల వ్యవధిలో 20,772 కొత్త కోవిడ్ -9 కేసులు, 14,651 రికవరీలు , 116 మరణాలు నమోదయ్యాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోవిడ్ -19 టీకాను ప్రతి నెలా ఒక కోటి మందికి అందించే సామర్ధ్యం కలిగి ఉన్నారని, ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో కరోనా కంట్రోల్లో ఉందని, ఇక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మరిన్ని టీకాలు అందించాలని కేంద్రాన్ని కోరారు.

దేశానికి కరోనా థర్డ్ వేవ్ , డెల్టా ప్లస్ వేరియంట్ భయం

దేశానికి కరోనా థర్డ్ వేవ్ , డెల్టా ప్లస్ వేరియంట్ భయం

కరోనా వ్యాప్తి మేలో నాలుగు లక్షల రోజువారీ కేసులతో గరిష్టంగా నమోదైంది . అయితే ప్రస్తుతం తగ్గుతున్న కేసులతో చాలా వరకు రాష్ట్రాలు కరోనా ఆంక్షలను సడలించాయి. కొన్ని రాష్ట్రాలు ఇంకా కేసుల కట్టడి కోసం నిబంధనలను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా కరోనా మూడవ వేవ్ భయాలు , డెల్టా ప్లస్ వేరియంట్ భయాలు దేశంలో విపరీతంగా పెరిగాయి. ఇదే సమయంలో వ్యాక్సిన్లు తీసుకున్నా కరోనా సోకున్తుందని పలు అధ్యయనాలు తేల్చాయి. అందుకే ప్రజలు సామాజిక దూర నిబంధనలు పాటించాలని కేంద్రం పదేపదే తేల్చి చెప్తుంది.

కరోనా థర్డ్ వేవ్ కట్టడికి.. వ్యాక్సినేషన్ పై దేశం దృష్టి

కరోనా థర్డ్ వేవ్ కట్టడికి.. వ్యాక్సినేషన్ పై దేశం దృష్టి

వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 45,60,33,754 కోవిడ్ -19 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కోవిడ్ -19 టీకా యొక్క సార్వత్రికీకరణ యొక్క కొత్త దశ జూన్ 21 న ప్రారంభమైంది. అప్పటి నుండి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కోవిడ్ -19 టీకాలను ఉచితంగా అందించడం ద్వారా ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది. థర్డ్ వేవ్ కట్టడి చెయ్యటానికి, కరోనా జాగ్రత్తలు పాటించటం, వ్యాక్సినేషన్ మార్గాలని అని పదేపదే చెప్తున్న నేపధ్యంలో దేశం వ్యాక్సినేషన్ పై దృష్టి సారించింది.

  Sonu Sood Making Orange Juice At Hyderabad, Video Goes Viral | Oneindia Telugu
   ప్రపంచ వ్యాప్తంగా 194 మిలియన్ల మందికి కరోనా

  ప్రపంచ వ్యాప్తంగా 194 మిలియన్ల మందికి కరోనా

  తగిన జాగ్రత్తలు పాటిస్తే థర్డ్ వేవ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. సెప్టెంబరు నాటికి భారతదేశం పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 194 మిలియన్ల మంది ప్రజలు కోవిడ్ -19 బారిన పడ్డారు. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 21% పెరిగింది. మరణాలలో ఎక్కువ భాగం అమెరికా మరియు ఆగ్నేయాసియాలో నమోదయ్యాయి.

  English summary
  India recorded 41,649 new cases of the coronavirus disease (Covid-19) in the last 24 hours, which pushed the nationwide tally to 31,613,993, and its death toll climbed to 4,23,810 with 593 daily fatalities, according to the Union ministry of health and family welfare.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X