• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్ లో కరోనా కల్లోలం: 90,928 తాజాకేసులు; తరుముకొస్తున్న ముప్పు.. తస్మాత్ జాగ్రత్త!!

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రమాదం పెను విపత్తును సృష్టించే దిశగా వెళుతోంది. భారతదేశంలో గత 24 గంటల్లో 90,928 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, ఇది నిన్న నమోదైన కేసులు 58,097 కేసుల కంటే 55 శాతం ఎక్కువ. ఇదిలా ఉంటే దేశంలో 2,630 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 797 కేసులు, ఢిల్లీలో 465 కేసులు ఉన్నాయి.

ముంబైలో కరోనా పంజా: సెకండ్ వేవ్ గరిష్ట కేసులను మించి; తాజాగా 15,166 కొత్తకేసులుముంబైలో కరోనా పంజా: సెకండ్ వేవ్ గరిష్ట కేసులను మించి; తాజాగా 15,166 కొత్తకేసులు

బాగా పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

బాగా పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య


భారత దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి వారానికి సానుకూలత రేటు 3.47 శాతంగా ఉంది. రోజువారీ సానుకూలత రేటు 6.43 శాతంగా నమోదయింది. రికవరీ రేటు ప్రస్తుతం 97.81 శాతంగా ఉంది. గత 24 గంటల్లో కనీసం 19,206 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,43,41,009. యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 1 శాతం కంటే తక్కువ, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.81 శాతంగా ఉన్నాయి. యాక్టివ్ కేసుల మొత్తం సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం ఈ సంఖ్య 2,14,004గా ఉంది.

గత 24 గంటల్లో 325 కరోనా మరణాలు

గత 24 గంటల్లో 325 కరోనా మరణాలు

ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో కోవిడ్‌తో 325 మంది మరణించారు. ఇందులో గత కొన్ని నెలల్లో కేరళలో 258 మరణాలు అదనంగా జోడించబడ్డాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల తర్వాత పెండింగ్‌లో ఉన్న అప్పీళ్ల ఆధారంగా జోడించబడింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున అనేక రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ వంటి ఆంక్షలను ప్రకటించాయి. ప్రస్తుతం 15-18 ఏళ్లలోపు వారికి టీకాలు వేస్తున్నారు.

రోజువారీ కేసుల పెరుగుదల, మహారాష్ట్రలో తాజాగా 26,538 కేసులు

రోజువారీ కేసుల పెరుగుదల, మహారాష్ట్రలో తాజాగా 26,538 కేసులు

ఇప్పటివరకు భారతదేశంలో 147 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లు అందించబడ్డాయి. ఇది కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.భారతదేశం యొక్క భారీ రోజువారీ కేసుల పెరుగుదలకు మహారాష్ట్ర 26,538 కొత్త కేసులను జోడించింది. పశ్చిమ బెంగాల్, ఒక రోజులో 14,022 కరోనా కేసులను నివేదించింది. గత 24 గంటల్లో ఢిల్లీలో తాజా కోవిడ్ కేసుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. మే 12 నుండి అతిపెద్ద రోజువారీ కేసుల పెరుగుదలలో 5481 నుండి 10,665కి చేరుకుంది. ఎనిమిది మరణాలు కూడా నమోదయ్యాయి . జూన్ 26 నుండి ఇప్పటి వరకూ ఇదే అత్యధికం కావడం గమనార్హం.

సెకండ్ వేవ్ కంటే ఉధృతంగా కరోనా వ్యాప్తి

సెకండ్ వేవ్ కంటే ఉధృతంగా కరోనా వ్యాప్తి

ముందుజాగ్రత్తగా తీసుకోవలసిన మూడో డోస్‌ను పొందేందుకు అర్హులైన వారికి ఎలాంటి మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ వ్యాక్సిన్‌లు ఉండవని భారత కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధిపతి డాక్టర్‌ వీకే పాల్‌ బుధవారం తెలిపారు. మార్చి-ఏప్రిల్‌లో రెండవ వేవ్ సమయంలో కంటే ఈసారి కోవిడ్ యొక్క సగటు రోజువారీ పెరుగుదల దాదాపు 21 శాతం వేగంగా ఉందని డేటా చూపించింది. ఇక ఈ కేసుల శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం భారత్లో థర్డ్ వేవ్ కొనసాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వాలు కూడా వార్నింగ్ ఇస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.

2,630 మంది కొత్త కోవిడ్ -19 స్ట్రెయిన్ ఒమిక్రాన్ బాధితులు

2,630 మంది కొత్త కోవిడ్ -19 స్ట్రెయిన్ ఒమిక్రాన్ బాధితులు

ఇదిలా ఉంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ భారతదేశంలోని 26 రాష్ట్రాలకు వ్యాపించింది. ఇప్పుడు 2,630 మంది కొత్త కోవిడ్ -19 స్ట్రెయిన్ బారిన పడ్డారు. భారతదేశం బుధవారం రాజస్థాన్‌లో తన మొదటి ఓమిక్రాన్ మరణాన్ని నివేదించింది. ఒమిక్రాన్ వేరియంట్ వల్లే ఇంత దారుణమైన పరిస్థితి ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా లేదని కానీ వ్యాప్తి తీవ్రత మాత్రం ఊహించని విస్పోటనం అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

English summary
India recorded 90,928 latest Covid-19 cases in the last 24 hours, which is 55 per cent more than the 58,097 cases registered yesterday. There have been 2,630 Omicron variant cases reported so far in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
Desktop Bottom Promotion