వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో క్షీణత దిశగా కరోనా; తగ్గుతున్న యాక్టివ్ కేసులు, తాజాగా 14,306 కొత్త కేసులు, 443 మరణాలు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలోకరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కాస్త హెచ్చు తగ్గులతో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 14,306 కొత్త కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) మరియు 443 కరోనా సంబంధిత మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన మొత్తం కేసులు మరియు మరణాలలో, ఒక్క కేరళ మాత్రమే 8,538 అంటువ్యాధులు, 71 మరణాలను నివేదించింది.

క్షీణిస్తున్న కరోనా యాక్టివ్ కేసులు
ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలోని యాక్టివ్ కేస్‌లోడ్ 167,695 వద్ద ఉంది, ఇది 239 రోజుల్లో అత్యల్పంగా ఉంది మరియు మొత్తం ఇన్ఫెక్షన్లలో 1 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల శాతం 0.49 శాతంగా ఉంది. ఇక రికవరీ రేటు 98. 18 శాతానికి చేరుకుంది. వీక్లీ పాజిటివిటీ రేటు 1.24 శాతం మరియు రోజువారీ పాజిటివిటీ రేటు 1.43 శాతంగా ఉంది. కోవిడ్-19 మహమ్మారి తగ్గుదల యొక్క రెండవ తరంగం యొక్క స్పష్టమైన సంకేతంలో, కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లలో రోజువారీ పెరుగుదల 31 వరుస రోజులుగా 30,000 కంటే తక్కువగా ఉంది.

పెరుగుతున్న రికవరీలు, మృతుల సంఖ్యలో పెరుగుదల కేరళ వల్లే
నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి బారినుండి 18,762 మంది కోలుకున్నారు. దీంతో కరోనా మహమ్మారి బారినుండి కోరుకునే వారి సంఖ్య మొత్తం ఇప్పటివరకు 3.35 కోట్లకు చేరుకుంది ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 3.41 కోట్లకు చేరుకున్నాయి. ఇక మరణాల సంఖ్య చూస్తే కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. గత 24 గంటల్లో నమోదైన 443 మరణాలతో కలిపి దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4 ,54,712 గా నమోదయింది. మరణాల సంఖ్య పెరగడం కేరళ మృతుల లెక్కలను సవరించడమే అందుకు కారణం గా కనిపిస్తుంది.

Corona in India; Decreasing active cases, latest 14,306 new cases, 443 deaths

102 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసులు
ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, భారతదేశం ఇప్పటివరకు 102 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ మోతాదులను నిర్వహించింది. అక్టోబరు 22న, దేశంలో 1 బిలియన్ వ్యాక్సిన్ డోస్‌లను ఇనాక్యులేషన్ డ్రైవ్ కింద అందించి హిస్టరీ ని బ్రేక్ చేసింది. గత 24 గంటల్లో 9,98,397 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 8,538 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, 363 మంది మరణించారు.

మహారాష్ట్ర తో పాటు అత్యధిక కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలలో తాజా లెక్కలు
కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో గత 24 గంటల్లో 1410 మంది కరోనా బారిన పడగా, 18 మంది మరణించారు. తమిళనాడు రాష్ట్రంలో గత 24 గంటల్లో 1127 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 15 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 989 కరోనా కొత్త కేసులు నమోదు కాగా పది మంది మరణించారు. ఇక మిజోరాం రాష్ట్రంలో 572 కరోనా కొత్త కేసులు నమోదు కాగా ఆరుగురు మరణించారు. ఒడిస్సా రాష్ట్రంలో గత 24 గంటల్లో 447 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 37 కరోనా కేసులు నమోదు కాగా జీరో మరణాలు నమోదయ్యాయి.

English summary
There have been 14,306 new coronavirus cases and 443 corona-related deaths in India in the last 24 hours. Of the total cases and deaths recorded in the past 24 hours, Kerala alone reported 8,538 infections and 71 deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X