వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో మళ్ళీ భారీగా .. తాజాగా 34,403 కరోనా కేసులు, 320 మరణాలు, పండుగలపై కేంద్రం అలెర్ట్

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 34,403 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే 12.5 శాతం ఎక్కువ. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 3,33,47,325గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి కారణంగా 320 మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 4.4 లక్షల మందికి పైగా కరోనా కారణంగా మరణించినట్లుగా తెలుస్తుంది.

వ్యాక్సిన్ గణేశ : కరోనా సమయంలో వ్యాక్సిన్ పై అవగాహనం కోసం .. ఎక్కడెక్కడ అంటే !!వ్యాక్సిన్ గణేశ : కరోనా సమయంలో వ్యాక్సిన్ పై అవగాహనం కోసం .. ఎక్కడెక్కడ అంటే !!

కేరళ వల్లే పెరుగుతున్న కేసులు .. తాజాగా 3,39,056 యాక్టివ్ కేసులు

కేరళ వల్లే పెరుగుతున్న కేసులు .. తాజాగా 3,39,056 యాక్టివ్ కేసులు

దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 3,39,056 గా ఉన్నాయి. ఇది 1.02 శాతం గా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 37,950 మంది కరోనా మహమ్మారి బారినుండి రికవర్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తంగా కరోనా మహమ్మారి బారినుండి 3.25 కోట్ల మంది కోలుకున్నారు. కేరళ నాలుగు రోజులలో మొదటిసారిగా 20,000 కంటే ఎక్కువ తాజా కోవిడ్ -19 కేసులను నివేదించింది, ఇది భారతదేశ రోజువారీ సంఖ్యను ఆరు రోజుల గరిష్ట స్థాయికి నిన్న 35,000 దగ్గరకు తీసుకెళ్లింది. కేరళ ఒక్క రాష్ట్రంలో మాత్రమే లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని, మహారాష్ట్రలో మాత్రమే 50,000 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.

 కేరళలో కొనసాగుతున్న ఉప్పెన .. పండుగ సీజన్ లో జాగ్రత్త అంటున్న కేంద్రం

కేరళలో కొనసాగుతున్న ఉప్పెన .. పండుగ సీజన్ లో జాగ్రత్త అంటున్న కేంద్రం

తాజాగా 2.25 శాతంగా ఉన్న రోజువారీ పాజిటివిటీ రేటు గత 18 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది.ప్రస్తుతం 1.97 శాతంగా ఉన్న వీక్లీ పాజిటివిటీ రేటు గత 84 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతుండగా, కేరళలో ఉప్పెన జాతీయ ఆందోళనకు కారణమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శించవద్దని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాబోయే పండుగ సీజన్ కోసం మరింత జాగ్రత్త వహించాలని సూచించింది. ఈ సంవత్సరం కోవిడ్ సురక్షిత ఉత్సవాలు మహమ్మారికి వ్యతిరేకంగా మా పోరాటంలో నిర్ణయాత్మక అంశం అని డాక్టర్ వికె పాల్ అన్నారు.

 ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులలో టాప్ ఫైవ్ లో ఉన్న దేశాలివే

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులలో టాప్ ఫైవ్ లో ఉన్న దేశాలివే

ప్రపంచవ్యాప్తంగా, ఇప్పటివరకు 22.63 కోట్లకు పైగా మొత్తం కరోనా కేసులు నమోదయ్యాయి; 46.5 లక్షల మందికి పైగా మరణించారు. యుఎస్ (4,15,36,395), బ్రెజిల్ (2,10,34,610), యునైటెడ్ కింగ్‌డమ్ (73,46,832), మరియు రష్యా, భారతదేశం కూడా ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన ఐదు దేశాల జాబితాలో ఉన్నాయి.

Recommended Video

వినాయక విగ్రహాల ధరలతో బెంబేలెత్తుతున్న భక్తులు!!
మోడీ పుట్టిన రోజు సందర్భంగా టీకా రికార్డుపై దృష్టి

మోడీ పుట్టిన రోజు సందర్భంగా టీకా రికార్డుపై దృష్టి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 71 వ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రభుత్వం ఈ రోజు ఒకే రోజు టీకా రికార్డుపై దృష్టి సారించింది. ఆగస్టు 27 న అత్యధికంగా ఒకే రోజులో ఇచ్చిన టీకాలు 1.03 కోట్లు కాగా తాజాగా మరో రికార్డు సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డబ్ల్యూహెచ్‌ఓ-అనుసంధాన ఆగ్నేయాసియా దేశాలలో ఇప్పటివరకు 1 బిలియన్‌లకు పైగా డోస్‌లు నిర్వహించబడుతున్నాయని, గ్లోబల్ బాడీ పేర్కొంది, భారతదేశంలోనే ఇప్పటివరకు 76 కోట్లకు పైగా డోస్‌లు ఇవ్వబడ్డాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇవ్వబడిన సగటు రోజువారీ మోతాదులలో 25 శాతం కంటే ఎక్కువ భారతదేశంలో ఉంది. ప్రభుత్వం పంచుకున్న డేటా ప్రకారం భారతదేశ సగటు రోజువారీ మోతాదు 8.83 మిలియన్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇది 25. 5 మిలియన్లుగా ఉంది.

English summary
The corona epidemic continues to spread in India. There have been 34,403 latest coronavirus cases reported in India in the last 24 hours. This is 12.5 per cent more than yesterday. The total number of cases registered since the outbreak is 3,33,47,325. Yesterday alone, 320 people died due to the corona epidemic. It is estimated that more than 4.4 lakh people in the country have died due to corona so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X