వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో 40 లక్షల మార్క్‌ దాటి జెట్ స్పీడ్ లో కరోనా .. 13 రోజుల్లోనే 10లక్షల కేసులు

|
Google Oneindia TeluguNews

ఇండియాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 40 లక్షల మార్కును దాటి ప్రస్తుతం భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి .కేవలం 13 రోజుల్లోనే 10లక్షల కేసుల నమోదు ఆందోళన కలిగిస్తుంది. భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మూడు మిలియన్ మార్క్ ను తాకిన 13 రోజుల తర్వాత ఇప్పుడు నాలుగు మిలియన్ లకు పైగా కేసులు నమోదయ్యాయి. కేవలం 13 రోజుల్లోనే మిలియన్ కేసులు నమోదు కావడం జెట్ స్పీడ్ లో కేసుల పెరుగుదల ఉందని చెప్పటానికి సాక్ష్యం.

కరోనాను జయించటంలో మహిళలే శక్తివంతులట...ఆసక్తికర అధ్యయనంకరోనాను జయించటంలో మహిళలే శక్తివంతులట...ఆసక్తికర అధ్యయనం

గత 24 గంటల్లో కొత్తగా 86,432 కరోనా పాజిటివ్ కేసులు, 1089మరణాలు

గత 24 గంటల్లో కొత్తగా 86,432 కరోనా పాజిటివ్ కేసులు, 1089మరణాలు

కరోనా తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 86,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1089 మంది కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా40,23,179 కరోనా కేసులు నమోదయ్యాయి . ప్రతినిత్యం కరోనా కేసులు పెద్దఎత్తున నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కూడా మొదలైనట్లుగా తెలుస్తుంది.
ప్రస్తుతం భారతదేశంలో 8 ,46,395 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా బారిన పడిన వారు ఇప్పటి వరకూ 31,07,223 మంది కోలుకున్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి.

జెట్ స్పీడ్ లో పెరుగుతున్న కేసులు .. అధికార వర్గాల్లో ఆందోళన

జెట్ స్పీడ్ లో పెరుగుతున్న కేసులు .. అధికార వర్గాల్లో ఆందోళన

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు మృతి చెందిన వారు 69,561 గా గణాంకాలు చెబుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 80 వేల లోపు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు ఆ మార్క్ ని క్రాస్ చేసి ఏకంగా 86 వేల పైచిలుకుకు చేరుకుంది. ఇంకా కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదని, లాక్ డౌన్ నిబంధనల సడలింపు ల నేపథ్యంలో కేసులు మరింత పెరుగుతున్నాయని అధికారిక వర్గాల నుండి ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రపంచ దేశాలను కేసుల వేగంలో అధిగమిస్తున్న ఇండియా

ప్రపంచ దేశాలను కేసుల వేగంలో అధిగమిస్తున్న ఇండియా

నిన్న ఒక రోజే దేశవ్యాప్తంగా 10 ,59,346 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు మొత్తం 4,77,38,491 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని ఐసీఎంఆర్ తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలోనే కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నట్లుగా చెబుతోంది. ఇప్పటికే భారత్ ప్రపంచంలో కరోనా ప్రభావిత దేశాలలో మూడవదిగా ఉంది. ఇక ఒకరోజు కరోనా కొత్త కేసుల నమోదు లో భారత్, ప్రపంచ దేశాలను అధిగమించి ముందువరుసలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ భారతదేశంలో కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్న పరిస్థితులు, వెయ్యికి పైగా పెరిగిన కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Recommended Video

US Election 2020 : Modi నాకు మంచి Friend.. So.. Indian-Americans ఓట్లన్నీ నాకే ! || Oneindia Telugu
 కేవలం 13 రోజుల్లో మిలియన్ కేసులు .. అమెరికా , బ్రెజిల్ కంటే వేగం

కేవలం 13 రోజుల్లో మిలియన్ కేసులు .. అమెరికా , బ్రెజిల్ కంటే వేగం

కరోనావైరస్ 40 లక్షల కేసులను నమోదు చేసిన ఇండియా ,అమెరికా మరియు బ్రెజిల్ తరువాత మూడవ దేశం. కేసులు ఒకటి నుండి 1 మిలియన్ వరకు పెరగడానికి 168 రోజుల సమయం తీసుకుంటే, ఇప్పుడు ఒక మిలియన్ కేసులు పెరగడానికి కేవలం 13 రోజుల సమయం తీసుకుంటుంది అంటే ఇండియాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారతదేశంలో కరోనా కేసులు 50 రోజుల్లో 1 మిలియన్ నుండి 4 మిలియన్లకు పెరిగాయి. ఇదే పెరుగుదలకు బ్రెజిల్‌లో 75 రోజులు, యుఎస్‌లో 86 రోజులు పట్టింది. అంటే భారతదేశంలోనే కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నట్లుగా అర్థమవుతుంది. ఏదేమైనా, భారతదేశం యొక్క మరణాల రేటు మూడు కరోనా ప్రభావిత దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది, ఇది యూఎస్ లో సంభవించిన మరణాల రేటులో సగం కంటే తక్కువగా ఉంది .

English summary
Covid-19 cases in India raced past 4 million , just 13 days after hitting the 3 million mark, even as fresh cases in the past 24 hours surged to a new high of over 86,432. This was the third consecutive day of highest rise in new cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X