వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

corona India update : మహమ్మారి పంజా ..గత 24 గంటల్లో 9,304 కొత్త కేసులతో బిగ్గెస్ట్ జంప్

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనావైరస్ కరాళ నృత్యమే చేస్తుంది . రోజు రోజుకీ కరోనా కేసులు కొత్త రికార్డ్ ను సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలోని కరోనాకేసుల నమోదు ఒక్కసారిగా బిగ్గెస్ట్ జంప్ తీసుకుంది . గత 24 గంటల్లో 9,304 మంది కరోనా వైరస్ బారిన పడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు . దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 216,919 కు పెరిగింది. ఇక మహారాష్ట్ర మరియు తమిళనాడులలో అధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, గత 24 గంటల్లో ఢిల్లీలో కేసులు అత్యధికంగా పెరిగాయి.

corona India update : 2 లక్షలు దాటిన కరోనా కేసులు .. గత 16 రోజుల్లోనే లక్ష కేసులుcorona India update : 2 లక్షలు దాటిన కరోనా కేసులు .. గత 16 రోజుల్లోనే లక్ష కేసులు

ఇండియాలో 6వేలకు పైగా మరణాలు

ఇండియాలో 6వేలకు పైగా మరణాలు

కరోనావైరస్ మహమ్మారి వల్ల సంభవించిన మరణాలు 6,000పైగా పెరిగి భయంకరమైన మైలురాయిని దాటాయి. గత 24 గంటల్లో 260 మంది మరణించారు. మహారాష్ట్ర లో కరోనా మరణమృదంగం మోగించింది . బుధవారం 122 మరణాలను నమోదు చేసింది . మొత్తం మరణాలలో దాదాపు 48% మహారాష్ట్ర నుండి నమోదు అయ్యాయి . ఇక ఢిల్లీలో కూడా 50 మంది మరణించగా, గుజరాత్‌లో గత 24 గంటల్లో 30 మంది కరోనావైరస్ రోగులు మరణించారు.

Recommended Video

Coronavirus Cases in India Rise To 2 Lakh, 8,000 New Cases In 24 Hours
ఇప్పటి వరకూ ఇండియాలో 2, 16,919 కరోనా పాజిటివ్ కేసులు

ఇప్పటి వరకూ ఇండియాలో 2, 16,919 కరోనా పాజిటివ్ కేసులు

భారత్ లో ఇప్పటి వరకూ 2, 16,919 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా గడచిన ఇరవై నాలుగు గంటల్లో 9,304 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. 260 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 6,075కు చేరుకుంది. ఇప్పటి వరకూ 1,04,106 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు భారత్ లో 1,06,737 ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

కరోనాతో మహారాష్ట్ర విలవిల .. 24 గంటల్లో 2,560 కొత్త కేసులు

కరోనాతో మహారాష్ట్ర విలవిల .. 24 గంటల్లో 2,560 కొత్త కేసులు

మహారాష్ట్రలో బుధవారం 2,560 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 74,860 గా ఉంది. మహారాష్ట్రలో మరణించిన వారి సంఖ్య 2,500 దాటింది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులు మరియు మరణాలు మహారాష్ట్రలోనే సంభవించాయి.తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య బుధవారం 25 వేల మార్కును దాటింది. గత 24 గంటల్లో 1,286 తాజా కేసులను రాష్ట్రం నిర్ధారించింది. మహారాష్ట్ర తరువాత 25 వేల కరోనావైరస్ కేసులు నమోదు చేసిన భారతదేశంలో రెండవ రాష్ట్రం తమిళనాడుగా ఉంది .

 ఢిల్లీలో పెరుగుతున్న కేసుల సంఖ్య

ఢిల్లీలో పెరుగుతున్న కేసుల సంఖ్య

ఢిల్లీలో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 1,513 మంది పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . దీంతో కరోనా వైరస్ కేసుల సంఖ్య 23,645 కు చేరుకుంది. దేశ రాజధానిలో 606 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఢిల్లీ ప్రభుత్వం ఇంతకుముందు "ఢిల్లీ కరోనా " అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించింది, దీనిపై ప్రజలు కరోనా రోగుల కోసం అందుబాటులో ఉన్న ఆసుపత్రుల గురించి వెంటిలేటర్ల గురించి సమాచారం పొందవచ్చు .

కరోనాకు ఫ్రీ జోన్ గా మారుతున్న భారత్

కరోనాకు ఫ్రీ జోన్ గా మారుతున్న భారత్

భారత్‌లో కరోనా రోజురోజుకూ విశ్వరూపం చూపిస్తోన్న తీరు ఆందోళన కలిగిస్తుంది . గత 15 రోజులుగా వరుసగా భారీ సంఖ్యలో కేసులు పెరుగుతూ ఉండటం ఇక నిన్న ఒక్క రోజే 9 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం భారత్ పై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని చెప్పటానికి ఉదాహరణగా నిలిచింది. ఇక లాక్ డౌన్ నిబంధనల నుండి సడలింపులు ఇవ్వటం కరోనా కు ఫ్రీ జోన్ గా మారింది. ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదు అవుతున్నాయి .

English summary
India witnessed the biggest jump in daily coronavirus count with 9,304 people testing positive in last 24 hours. The total number of coronavirus cases in the country increased to 216,919.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X