వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

corona india update : లక్షా 12 వేలకు పైగా కేసులు.. 3,435 మరణాలు .. హాట్ స్పాట్ రాష్ట్రాలివే !!

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కరోనా పంజా విసురుతుంది. కరోనా మహమ్మారి చాలా వేగంగా విస్తరిస్తుంది . ఒకపక్క లాక్ డౌన్ 4.0 అమలవుతుంది. మరోపక్క కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు కూడా ఇస్తున్నాయి . కొన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయి సడలింపులు ఇస్తున్న పరిస్థితి ఉంది . ఇక దీంతో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి.

corona global update : ప్రపంచ వ్యాప్తంగా 50లక్షలు దాటిన కేసులు .. కరోనాపై యుద్ధానికి నాయకత్వం వహిస్తcorona global update : ప్రపంచ వ్యాప్తంగా 50లక్షలు దాటిన కేసులు .. కరోనాపై యుద్ధానికి నాయకత్వం వహిస్త

 దేశంలో కరోనా హాట్ స్పాట్ గా మారుతున్న నగరాలపై ఫోకస్

దేశంలో కరోనా హాట్ స్పాట్ గా మారుతున్న నగరాలపై ఫోకస్

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 కొనసాగుతున్నా వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వస్తున్న నేపధ్యంలో కొంత కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా దేశంలో కరోనా వ్యాప్తికి కారణం అవుతున్న ప్రధాన నగరాలపై కేంద్రం ఫోకస్‌ పెట్టాలని ఇప్పటికే నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సూచనలు చేసింది.దేశ వ్యాప్తంగా 5 ప్రధాన ప్రాంతాలను గుర్తించింది. అందులో మహారాష్ట్ర,తమిళనాడు,ఢిల్లీ వంటి రాష్ట్రాలకు చెందిన నగరాలు కరోనా హాట్ స్పాట్ గా ఉన్నాయి .

 భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 1,12,359

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 1,12,359

నేడు ఉదయం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 1,12,359 కు పెరిగింది, క్రియాశీల కేసులు 63,624 గా ఉన్నాయి. గత 24 గంటల్లో 3,435 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో కేసుల సంఖ్యలో రెండవ అతిపెద్ద సింగిల్ డే మరణాలుగా పేర్కొంది. ఇక మహారాష్ట్ర కరోనా పాజిటివ్ కేసుల్లో టాప్ పొజీషన్ లో ఉంది . ఇప్పటి వరకు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.

టాప్ లో మహారాష్ట్ర .. ఇప్పటివరకు 39,297 కేసులు నమోదు

టాప్ లో మహారాష్ట్ర .. ఇప్పటివరకు 39,297 కేసులు నమోదు

మహారాష్ట్రలో 39,297 కేసులు నమోదు కాగా 27,589 యాక్టివ్ కేసులు ఉన్నాయి .ఇప్పటివరకు 10,318 కేసులు రికవర్ కాగా 1,390 మంది మృతి చెందారు . మహారాష్ట్రలోనే ఉన్న నగరం, ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారావి ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 1378కి చేరిందని తెలిపింది బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కాగా, ధారావి ప్రాంతంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 56 మంది మృతి చెందినట్టు బీఎంసీ వెల్లడించింది. ఇక్కడ కొవిడ్-19 మరణాల రేటు 4.1 శాతంగా ఉన్నట్టు తెలిపింది..

రెండవ స్థానంలో తమిళనాడు ..ఇప్పటివరకు 13,191 కేసులు

రెండవ స్థానంలో తమిళనాడు ..ఇప్పటివరకు 13,191 కేసులు


ఇక తమిళనాడులో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తుంది. నిన్న ఒక్కరోజే తమిళనాడులో 743 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,191కి చేరింది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల 87మంది మరణించారు..రాష్ట్రంలో కేసులలో చాలా వరకూ మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన వారిలో దాదాపుగా 83 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది .తమిళనాడులో ఇప్పటివరకూ 5 వేల 8 వందల 82 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

 మూడో స్థానంలో గుజరాత్ ..ఇప్పటివరకు 12,539 కేసులు

మూడో స్థానంలో గుజరాత్ ..ఇప్పటివరకు 12,539 కేసులు

ఇక గుజరాత్ లోనూ కరోనా కోరలు చాస్తుంది. కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గుజరాత్ లో కరోనా కేసులు చూస్తే ఇప్పటివరకు 12,539 కేసులు నమోదు కాగా 6,571 కేసులు యాక్టివ్ గా ఉన్నాటి. ఇక కరోనా మహమ్మారి నుండి బయటపడినవారు 5,219 మంది కాగా 749 మంది ఇప్పటివరకు మరణించారు. ఇక గుజరాత్ దేశంలో కరోనా కేసుల్లో మూడో స్థానంలో ఉంది . గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో అత్యధికంగా 9,216 కేసులు నమోదు అయ్యాయి.

 ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్ .. రోజుకు 500 పైగా కేసులు

ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్ .. రోజుకు 500 పైగా కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది . రెండు రోజుల నుంచి వరుసగా 500 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 11,088 గా నమోదైంది . బాధితుల సంఖ్య రాష్ట్రంలో మరింత పెరుగుతుందనీ... రోజుకు 1000 కేసులు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో మొత్తం 534 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది . ఇక్కడ ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఢిల్లీలో ప్రస్తుతం 5 ,720 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకు 5,192 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 176 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

English summary
Today is the fifty-eighth day of India’s nationwide lockdown, meant to curb the novel coronavirus pandemic. Confirmed COVID-19 cases in India stand at 1,12,359. The death toll from the outbreak in India is at 3,435. Maharashtra, Tamil Nadu, Gujarat and Delhi have reported the highest number of cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X